విరాళం రూ.755 కోట్లు...ఎందుకో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

క‌రోనా విప‌త్తు స‌మ‌యంలో  40 ఏళ్ల పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా ప‌నిచేసిన నారా చంద్ర‌బాబునాయుడు ఏపీ ప్ర‌భుత్వానికి ఇచ్చిన విరాళం రూ.10 ల‌క్ష‌లు. అవును మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. అక్ష‌రాలా ప‌దే ప‌ది ల‌క్ష‌లు ఆయ‌న విరాళం ఇచ్చారు. కానీ మొట్ట మొద‌ట‌గా స్పందించి ప్ర‌భుత్వానికి విరాళం ఇచ్చాన‌ని వెల‌క‌ట్ట లేని ప్ర‌చారాన్ని బాబుతో పాటు టీడీపీ నాయ‌కులు గొప్ప‌లు చెప్పుకోవ‌డాన్ని చూశాం.

కానీ త‌న జాతిపై జ‌రుగుతున్న వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న సంస్థ‌ల‌కు ఓ బాస్కెట్‌బాల్ దిగ్గ‌జం ఇచ్చిన విరాళం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్యంతో నోరెళ్ల బెడుతారు. ఇటీవ‌ల అమెరికాలో  న‌ల్ల‌జాతీయుడైన  జార్జి ఫ్లాయిడ్‌ను ఆ దేశ పోలీసు ప్రాణాలు తీయ‌డంపై ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌జా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. మ‌రీ ముఖ్యంలో అమెరికాలో నిర‌స‌న‌లు వెల్లువెత్తు తున్నాయి. ఈ నేప‌థ్యంలో జాతి వివ‌క్ష‌పై పోరాటానికి అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గ‌జం, 57 ఏళ్ల  మైకేల్ జోర్డాన్ అండ‌గా నిలిచేందుకు ముందుకొచ్చాడు.

పోరాట సంస్థలకు జోర్డాన్‌ 10 కోట్ల డాలర్ల (రూ. 755 కోట్లు) విరాళం ప్రకటించాడు. ఇందులో 4 కోట్ల డాలర్లు (రూ. 302 కోట్లు) ‘నైకీ’ రూపొందించిన ‘జోర్డాన్‌ బ్రాండ్‌’ తరపున అందజేస్తారు. విరాళానికి సంబంధించి వివ‌రాల‌ను సామాజిక మాధ్యమాల వేదికగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

‘వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యావకాశాలు అనే లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం 10 సంవత్సరాలకు పైగా ధనాన్ని సమకూర్చుతాం. ‘నల్లజాతి వారి ప్రాణాలూ ప్రధానమే’. దేశంలో వేళ్లూనుకుపోయిన జాత్యాహంకారం నశించే వరకు, నల్లజాతీయుల జీవితాలను మెరుగుపరిచేందుకు వారిని రక్షించేందుకు మేం కట్టుబడి ఉంటాం’ అని చికాగో బుల్స్‌ మాజీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ జోర్డాన్‌ పేర్కొన్నాడు.  

పోలీసుల దురాగతానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్‌ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కాగా పోరాటాల‌కు ఇంత భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వ‌డం చాలా త‌క్కువే. అలాంటిది జోర్డాన్ ముందుకొచ్చి జాతి వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరాటానికి అండ‌గా నిల‌బ‌డ‌డం ప్ర‌శంస‌లు కురిపిస్తోంది. 

చెప్పినదానికన్నా ఎక్కువ చెయ్యడం మా బలహీనత

Show comments