రాహుల్ తప్పుకుంటే బాధ్యతలు ఆమెకే!

కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ గాంధీ ఇప్పటికే రాజీనామా పత్రాన్ని దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు అయిన నేపథ్యంలో తను కాంగ్రెస్  జాతీయ అధ్యక్షుడిగా పనికిరానంటూ డిసైడ్ అయ్యి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే దాన్ని ఆమోదించడం లేదు ఆ పార్టీ. రాహుల్ ను కన్వీన్స్ చేసి, ఆ బాధ్యతల నుంచి వైదొలగవద్దని కాంగ్రెస్ వాళ్లు కోరుతూ ఉన్నారు. సోనియాగాంధీతో సహా కాంగ్రెస్ నేతలంతా రాహుల్ ను బతిమాలే పనిలో ఉన్నారు.

అయితే రాహుల్ గాంధీ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. తను రాజీనామాకు కట్టుబడినట్టుగా రాహుల్ స్పష్టం చేశారట. ప్రస్తుతానికి అయితే రాహుల్ గాంధీ రాజీనామా వ్యవహారం పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో ఆ రాజీనామాకు రాహుల్ గాంధీ కట్టుబడితే తదుపరి బాధ్యతలు ఎవరికి? అనేది చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ రాజీనామాకు కట్టుబడితే ఆ తర్వాత బాధ్యతలు ప్రియాంక గాంధీ తీసుకుంటారనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. పార్టీ తమ చేతుల్లోంచి చేజారడానికి సోనియాగాంధీ ఏమాత్రం ఇష్టత చూపకపోవచ్చు. అందుకే ఆమె రాహుల్ ను కన్వీన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారట. అంతకూ రాహుల్ పట్టుబడితే మాత్రం ఆ బాధ్యతలు దక్కేది ప్రియాంక గాంధీకే అని వార్తలు వస్తున్నాయి.

అది బాగుండదు అనుకుంటే.. మరి కొందరు వీర విధేయుల పేర్లను పరిశీలిస్తూ ఉన్నారట. రాజస్తాన్ సీఎం గెహ్లాట్, జ్యోతిరాధిత్య సింధియా, సచిన్ పైలట్.. ఈ ముగ్గురూ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి రేసులో ఉన్నారని సమాచారం. ప్రియాంక కానీ, గాంధీ ఫ్యామిలీకి వీర విధేయులు అయిన ఈ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?