సోషల్ మీడియా కార్యకర్తలను ఇరికించిన చంద్రబాబు!

ఇదే వెబ్ సైట్ కామెంట్ సెక్షన్లో తెలుగుదేశం పార్టీ మానసిక రోగులు చాలా మంది తమ కామెంట్లతో విరుచుకుపడుతూ ఉంటారు. అత్యంత నీఛమైన మాటలతో తమ రోగాన్ని వారు చాటుకుంటూ ఉంటారు. ఈ మధ్యనే అలాంటి పచ్చిబూతుల పోస్టులను సగర్వంగా వినిపించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తను చేస్తేనేకాదు, తమవాళ్లు చేస్తే శృంగారం, వేరేవాళ్లు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడి తీరు. సంస్కారం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు ముందు దాన్ని తమ వారికి నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలుగుదేశం పార్టీ అభిమాన వర్గమే ఈ వల్గర్ పోస్టులకు, నీఛమైన కామెంట్లకు తెరలేపింది అనేది  ఒక విశ్లేషణ. గత పదేళ్లుగా సోషల్ మీడియా పోకడలను గమనించిన వారు ఎవరైనా ఈ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో సాగిన దుష్ప్రచారం సంగతీ తెలిసిందే. ఆ విషయంలో పలుసార్లు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఆయా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అడ్డంగా బుక్ అయ్యారు.

అంతా చేసింది తమవాళ్లు అయితే, చంద్రబాబు నాయుడు  మాత్రం తెగ ఫీల్ అయిపోయారు. ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడు చేసిన రాద్ధాంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దాదాపు రెండువేల ఫేక్ అకౌంట్లతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో సాగించే దుష్ప్రచారం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైఎస్ ఫ్యామిలీపై చేసే నీఛ, దుష్ప్రచారం గురించి వారు ఫిర్యాదు చేశారు. వారంతా లోకేష్ ఇచ్చే జీతభత్యాలతో పని చేస్తూ నీఛ ప్రచారం చేస్తూ ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నవేళ చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో బూతులు చదివి వినిపించారు. అయితే తమవారు పత్తిత్తులు కాదనే విషయం చంద్రబాబుకు తెలియనది కాదు. ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగారు. ఇక పచ్చ సైన్యం పెట్టే బూతు పోస్టులకు ఇప్పుడు మరింత ప్రచారం వస్తోంది. తెలుగుదేశం వీరాభిమాన వర్గాల్లో ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా.. వాటిని డైరెక్టుగా చంద్రబాబు నాయుడుకే ట్యాగ్ చేస్తే సరిపోతుందని పరిశీలకులు అంటున్నారు.

తమ వారిని అంటే తట్టుకోలేకపోయిన చంద్రబాబు నాయుడుకు తమవారు వాడే బూతులను వినిపిస్తే.. అప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు రేపిన రచ్చతో.. ఇప్పుడు బూతు పోస్టులు పెట్టే తమ్ముళ్లంతా ఇరుక్కున్నారు. ఈ విషయంలో తమ పండితులను బుక్ చేసి.. చంద్రబాబు నాయుడు మరో సెల్ఫ్ గోల్ చేసుకున్నారని పరిశీలకులు అంటున్నారు.

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం