కో డైరక్టర్ తో బన్నీ వివాదం?

డైరక్టర్ త్రివిక్రమ్ హీరో బన్నీతో చేస్తున్న సినిమాకు బ్రేక్ పడింది. రెండు మూడు రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది. షూటింగ్ సందర్భంగా హీరో బన్నీకి ఓ సీనియర్ కో డైరక్టర్ కు మధ్య చిన్నవివాదం జరగడమే కారణంగా తెలుస్తోంది. ఎమ్ ఎస్ రెడ్డి దగ్గర నుంచి రాజమౌళి వంటి మహామహుల దగ్గర పనిచేసిన సీనియర్ కో డైరక్టర్ ఒకరు ప్రస్తుతం త్రివిక్రమ్ కోసం ఈ సినిమాకు పని చేస్తున్నారు.

మరి ఏమయిందో? వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కానీ, బన్నీకి ఆయనకు మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బన్నీ ఆ కో డైరక్టర్ పై కాస్త మాటలు విసిరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కో డైరక్టర్ చాలా మంచి వ్యక్తి అని, గొడవలు పడే మనిషి కాదు అని బోగట్టా.

వాస్తవానికి ఈ విషయంలో దర్శకుల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని ఆ సీనియర్ కో డైరక్టర్ మొదట్లో అనుకున్నారని, కానీ తరువాత అందరూ కలిసి సర్ది చెప్పేసారని బోగట్టా. దాంతో అలా వ్యవహారం సైలంట్ అయిపోయింది. ప్రస్తుతానికి షూట్ ఆపి, 20 నుంచి మళ్లీ సెట్ మీదకు వెళ్తారని తెలుస్తోంది. 

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా