చిరుకు సోనాక్షి ఓకె అంటుందా?

సీనియర్ హీరోలు అందరికీ ఒకటే సమస్య. హీరోయిన్ ఫిక్స్ కావడం. మెగాస్టార్ చిరంజీవి కొంచెం అడ్వాంటేజ్ ఏమిటంటే బడ్జెట్ సమస్య లేకపోవడం. అందుకే ఈ సారి ఏకంగా సోనాక్షి సిన్హాను అప్రోచ్ అయ్యారన్న వార్త గుప్పుమంది. 

మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమా ఇంకా చాలా అంటే చాలా దూరంలో వుంది. మైత్రీ మూవీస్ కు బాలీవుడ్ లో వున్న పరిచయాలతో సోనాక్షిని అప్రోచ్ అయ్యారు. 

ఆమె కూడా బాలీవుడ్ లో ఏమంత బిజీగా లేదు కనుక సానుకూలంగానే స్పందించినట్లు బోగట్టా. గతంలో పవన్, మహేష్ ఇలా చాలా మంది కోసం సోనాక్షి ని తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ నో చెప్పింది అని వార్తలు వచ్చాయి.

మరి ఈసారి ఓకె అంటుందా అన్నది చూడాలి. సోనాక్షి గతంలో రజనీకాంత్ తో లింగా సినిమా చేసింది. ఆ సినిమా పరమ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తరువాత మళ్లీ సౌత్ జనాలు ఆమె వైపు చూడలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు చిరు సినిమాలో ఆఫర్ వచ్చింది. 

Show comments