వెంకీ ముద్దు.. నాగ్ ఏడుపు.. నాకు అది చాలు

సైరా సినిమా చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చిరంజీవిని ఆకాశానికెత్తేశారు. చాలామంది హీరోలు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్, ఫేస్ బుక్ లో పంచుకున్నారు. మరి చిరంజీవి సమకాలీకులు నాగార్జున, వెంకటేష్ రియాక్షన్ ఏంటి? వాళ్ల స్పందన ఏంటనే విషయాన్ని స్వయంగా చిరంజీవి బయటపెట్టారు.

"నాతో పాటు నాగార్జున సినిమా చూశారు. సినిమా అయిన తర్వాత బయటకొచ్చి నన్ను గట్టిగా పట్టేశారు. ఆయనకు మాట రావడంలేదు, కళ్లు ఎర్రబడిపోయాయి. ఇదొక ఎపిక్ అన్నారాయన. ఆ తర్వాత వెంకటేష్ ఫోన్ చేశారు. ఇంట్లో ఉంటారా వచ్చి కలవాలి అన్నారు. రమ్మన్నాను. ఆయన రావడం రావడమే నన్ను గట్టిగా కౌగలించుకున్నారు. ఓ ముద్దు పెట్టేశారు. ఎంతకీ వదల్లేదు. అప్పుడు కూర్చొని సెటిల్ అయ్యారు. హమ్మయ్య ఇప్పటికి తన కోరిక తీరిందన్నారు. మాటలు చెప్పే కంటే హగ్ చేసుకోవాలని అనిపించిందన్నారు."

తన తోటి హీరోలు, ఇంతలా ఫీల్ అయి చెబుతుంటే, అంతకంటే తనకు కావాల్సిందేముందన్నారు చిరంజీవి. నాగ్, వెంకీ, బిగ్ బి లాంటి ప్రశంసల ముందు ఏ అవార్డు సరిపోదన్నారు. అదే వరసలో రజనీకాంత్ గురించి కూడా చెప్పుకొచ్చారు. రజనీకాంత్ ఫోన్ చేసి జస్ట్ సినిమా బాగుందని మాత్రమే చెబుతారని, కానీ రజనీకాంత్ భార్య కూడా మాట్లాడి తనను మెచ్చుకోవడం చాలా సంతోషం కలిగించిందన్నారు చిరంజీవి.

దసరా సందర్భంగా సైరా ప్రమోషన్ కోసం ఈసారి త్రివిక్రమ్ ను రంగంలోకి దించింది మెగా కాంపౌండ్. త్రివిక్రమ్ ఇంటర్వ్యూ చేస్తే చిరంజీవి, రామ్ చరణ్ జవాబులు చెప్పాలనేది కాన్సెప్ట్. కానీ ఇంటర్వ్యూ మొత్తం త్రివిక్రమ్, చిరును పొగడడానికే సమయం కేటాయించారు. చిరంజీవి ఎప్పట్లానే చెప్పిందే చెప్పారు. నిర్మాత రామ్ చరణ్ ప్రేక్షకపాత్ర వహించాడు. 

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం