చిరంజీవి.. తెలివైన పనే చేశారు!

'అదిగో.. జనసేన తరఫున ప్రచారానికి రాబోతున్నారు..', 'ఇదిగో.. కొండా విశ్వేశ్వర రెడ్డి తరఫున చేవెళ్ల సెగ్మెంట్ అంతా తిరిగి చిరంజీవి ప్రచారం చేస్తారు..', 'సుమలత కోసం చిరంజీవి ప్రచారానికి వెళ్లబోతున్నారు. మండ్య నియోజకవర్గంలో చిరంజీవి ప్రచారం ఉంటుంది..' ఇవీ ఇన్నాళ్లూ వినిపించిన మాటలు.

ఇదివరకూ ఒక రాజకీయ పార్టీని పెట్టి దాన్ని విలీనం చేసేసి, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా కొద్దోగొప్పో అధికారాన్ని ఎంజాయ్ చేసి, ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయిన మెగాస్టార్.. తను పాలిటిక్స్ కు శాశ్వతంగా దూరం అయినట్టే అని ఈ ఎన్నికలతో స్పష్టతను ఇచ్చేశారు.

ఈ ఎన్నికల్లో చిరంజీవి సొంత తమ్ముళ్లు ఇద్దరు పోటీచేశారు. పవన్ కల్యాణ్ ఒక పార్టీ అధినేతగా ఈ ఎన్నికలను ఎదుర్కొన్నారు. రెండుచోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారాయన. ఇక చిరు పెద్దతమ్ముడు నాగబాబు ఎంపీగా పోటీచేశారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తన తమ్ముళ్లు ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఇప్పుడు పోటీ చేశారు. అయినా చిరంజీవి వారి కోసం ప్రచారం దరిదాపుల్లోకి రాలేదు. ఏ మీడియా స్టేట్ మెంటో ఇచ్చి.. సోషల్ మీడియాలోనో పోస్టు పెట్టి కూడా వారికి సపోర్ట్ చేయలేదు.

ఈ ఎన్నికలు, రాజకీయంతో తనకు సంబంధమే లేదన్నట్టుగా మెగాస్టార్ గడిపేశారు. అక్కడికీ మెగా హీరోలు కొందరు ఆపుకోలేకపోయినా.. చిరంజీవి మాత్రం విదేశీ వెకేషన్ కు వెళ్లిపోయి కామ్ అయిపోయారు. రాజకీయ వేడి తగలనంత దూరంలో నిలిచారు.

ఒకరకంగా ఇది తెలివైన నిర్ణయమే అని చెప్పవచ్చు. అనుభవపూర్వకంగా చిరంజీవి అర్థం చేసుకుని రాజకీయాలకు దూరంగా నిలిచారు. ఇక భవిష్యత్తులో కూడా మెగాస్టార్ రాజకీయాల వైపు చూసే అవకాశాలు లేవని కూడా ఇప్పుడు స్పష్టత వచ్చినట్టే! 

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది

Show comments