అరాచక ఎమ్మెల్యేకు బుద్ధిచెప్పిన ప్రజలు

ఉన్న ఐదేళ్లలో ప్రజలకు చుక్కలు చూపించాడు. అధికారులకు నరకం చూపించాడు. అతడే చింతమనేని ప్రభాకర్. దెందులూరు నియోజకవర్గంలో ఇతడి ఆగడాలకు అంతం లేకుండా పోయింది. చంద్రబాబు అండతో చింతమనేని చేయని అరాచకం లేదు. ఏకంగా తహశీల్దారు వనజాక్షిపై భౌతిక దాడికి దిగిన ఇతడి అరాచకాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. అలాంటి ఎమ్మెల్యేకు దెందులూరు ప్రజలు బుద్ధిచెప్పారు. ఈ ఎన్నికల్లో అతడ్ని ఓడించారు.

చింతమనేని అరాచకాలకు చరమగీతం పాడారు. ఐదేళ్లలోనే జీవిత కాలానికి సరిపడేంత అప్రతిష్టను మూటగట్టుకున్నాడు చింతమనేని. ఇతడ్ని ఓడించాలని కేవలం ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. రాష్ట్రం మొత్తం కోరుకుందంటే ఇతడి అరాచకం ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు. ఇలా చింతమనేని దెందులూరులో ఓడిపోయారు. వైసీపీకి చెందిన కొటారు అబ్బయ్యచౌదరి 17వేలకు పైగా ఓట్ల మెజారిటీతో చింతమనేనిపై నెగ్గారు.

ఎన్నికల ప్రచారంలో కూడా చింతమనేని తన పొగరు తగ్గించుకోలేదు. ప్రజల్ని ఇష్టమొచ్చిన మాటలన్నారు. "మీకెందుకురా రాజకీయాలు, ఏదైనా చేస్తే మేమే చేయాలి సన్నాసుల్లారా" అంటూ చింతమనేని మాట్లాడిన విధానాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. చివరికి సొంత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా రివర్స్ అయ్యేంత వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. ఇవన్నీ అతడి పరాజయానికి కారణాలయ్యాయి.

మొత్తానికి అరాచక ఎమ్మెల్యే పరిపాలన ముగిసింది. దెందులూరు ప్రజలు, అధికారులు ఈ ఐదేళ్లలో అనుభవించిన కష్టాలు తీరిపోయాయి. 

సినిమా రివ్యూ: సీత

Show comments