చిదంబరం.. జైలు నుంచి జైలుకే!

ఇప్పటికే చాలా రకాలుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. గతంలో చిదంబరం బాధితులు ఎలా అయితే బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకుని అష్టకష్టాలు అనుభవించారో, ఇప్పుడు చిదంబరానికి అదే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

చిదంబంరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకులు కేరాఫ్ జైలు అనే పరిస్థితి నడిచింది. చీకట్లో తనను కలిసే వాళ్లను తప్ప మిగతా వాళ్లందరినీ చిదంబరం జైలుకు పంపించాడనే పేరును కలిగి ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చిదంబరం కేరాఫ్ తీహార్ జైలు పరిస్థితి కొనసాఉగతూ ఉంది.

బెయిల్ పిటిషన్ల మీద బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నా చిదంబరానికి ఎక్కడా ఊరట లభించడం లేదు. ఇక ఇప్పుడు చిదంబరాన్ని అరెస్టు చేసుకునేందుకు ఈడీకి కూడా అవకాశం ఇచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ముందుగా సీబీఐ అరెస్టు చేసింది. తీహార్ జైలుకు తరలించింది. ఇక అదే కేసులో ఈడీ కూడా చిదంబరాన్ని అరెస్టు చేయాలని అంటోంది.

ఈ మేరకు కోర్టు పర్మిషన్ తీసుకుంది. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఈడీకి పర్మిషన్ ఇచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఆల్రెడీ జైల్లో ఉన్న చిదంబరాన్ని ఈడీ కూడా అరెస్టు అంటోంది. సీబీఐ వ్యవహారంలో చిద్దూకు బెయిల్ వచ్చినా, మళ్లీ ఈడీ అరెస్టు తో ఆయన జైల్లోనే ఉండాల్సి రావొచ్చునేమో!

Show comments

Related Stories :