చరణ్ సినిమా సెట్ కు మెగాస్టార్

రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో డివివి దానయ్య సినిమా షూట్ అజర్ బైజాన్ లో భారీగా జరుగుతోంది. మరోపక్క జార్జియాలో రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి జార్జియా వెళ్లేదుకు బయల్లేరిన మెగాస్టార్, బుధవారం తిన్నగా ముందు, కొడుకు సినిమా లోకేషన్ కు వెళ్లిపోయారు. అక్కడ సాయంత్రం ప్యాకప్ చెప్పేవరకు గడిపారు.

అంతే కాదు, మరో రోజు లేదా రెండు రోజులు అక్కడే వుంటారట మెగాస్టార్. ఆ తరువాతే తన సైరా సినిమా షూట్ జరుగుతున్న జార్జియాకు బయల్దేరి వెళ్తారట. విశేషం ఏమిటంటే ఇటు అజర్ బైజాన్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ లే చిత్రీకరిస్తున్నారు. అటు జార్జియాలో ఇరవై రోజుల పాటు భారీ వార్ ఎపిసోడ్ నే చిత్రించబోతున్నారు.

సాధారణంగా రామ్ చరణ్ సినిమాల కథలు వినడం దగ్గర నుంచి, ప్రోగ్రెస్, క్వాలిటీ ఇవన్నీ ఎప్పటికప్పుడు చిరంజీవి చూసుకుంటూ వుంటారు. ఇప్పుడు ఏకంగా షూటింగ్ లోకేషన్ కే వెళ్లి రెండు మూడు రోజులు వుండడం అంటే కొడుకు సినిమా మీద శ్రద్ధ మెగాస్టార్ కు ఏ రేంజ్ లో వుంది అన్నది అర్థం అవుతుంది.