చంద్రగిరి- మంగళగిరి.. వాట్టే రైమింగ్!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సొంతూరు చంద్రగిరి పేరు చెబితే చాలా చికాకుగా ఉంటుందని అంటారు. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడి పొలిటికల్ కెరీర్ లో చంద్రగిరి ఒక పీడకల. ఆయనను ఓడించిన నియోజకవర్గం చంద్రగిరి. ఎమ్మెల్యేగా పోటీచేసి బాబు అక్కడ నుంచి ఓడిపోయారు.

మళ్లీ జీవితంలో చంద్రగిరి నుంచి పోటీచేసే ధైర్యం చేయలేదు. చంద్రబాబు నాయుడు సొంతూరు ఇప్పటికీ చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. అయితే చంద్రబాబు మాత్రం అక్కడ నుంచి పోటీకి సాహసం చేయడంలేదు. కుప్పానికి వెళ్లిపోయి, అక్కడ నుంచినే కొనసాగుతూ ఉన్నారు. ఆఖరికి ఈసారి కూడా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచినే పోటీ చేస్తున్నారు.

కుప్పంను తనయుడి కోసం కూడా త్యాగం చేయలేదు. చంద్రగిరి లాగే మంగళగిరి.. అనే ఒక టాక్ వినిపిస్తోందిప్పుడు. చంద్రగిరి-మంగళగిరి అనే రైమింగ్ కూడా సెట్ అవుతోంది. లోకేష్ కు ఇప్పుడు అక్కడ అంత అనుకూలత లేదు అని అంటున్నారు పరిశీలకులు. లోకేష్ ప్రచార పర్వాన్ని గమనించిన వారు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేసుకొంటున్నాడు లోకేష్ బాబు!

ఒక పార్టీకి రాష్ట్రస్థాయి నేత.. తెలుగుదేశం పార్టీలో నంబర్ టు అని చెప్పుకోవాల్సిన నేత.. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాల్సిన నేత.. పోలింగ్ కు ఇరవై రోజుల ముందే మంగళగిరిలో మకాం పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఏదో లెక్కలతో ఇక్కడ నుంచి పోటీ అని ప్రకటించేశారు కానీ.. ఇప్పుడు అసలైన కథ మొదలైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

‘లోకేష్ ఓడిపోతాడా..’ అని కొందరు తెలుగుదేశం వీరాభిమానులు, తటస్థులు కూడా ఆశ్చర్యంతో కూడిని ప్రశ్నను వేయవచ్చు గాక. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఇందిర ఓడిపోయారు, ఎన్టీఆర్ కూడా అనామకుడి చేతిలో ఓడారు. చంద్రబాబు కూడా ఓడారు.

సో.. లోకేష్ ఓడతాడు అంటే అంత ఆశ్చర్యం అక్కర్లేదు. లోకేష్ కు మంగళగిరి మాన్యాలే అనేమాట కూడా ట్రెండ్ అవుతోంది. మరోవైపు నోరుజారుడు అనే తన తీరును కొనసాగిస్తూ ఉన్నాడు లోకేష్ బాబు. 

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments