స్లిప్పుల మీద కూడా అనుమానమేనా బాబూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రస్తుతానికి ఉన్న చంద్రబాబునాయుడు... తన పట్ల ప్రజల తిరస్కారాన్ని ఏ విధంగా మాయచేసి.. ప్రపంచానికి చాటిచెప్పాలో చాలా గట్టిగానే ప్రిపేర్ అవుతున్నట్లున్నారు. మొన్నటిదాకా ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నది... వీవీపాట్ స్లిప్పులను యాభైశాతం లెక్కించాల్సిందే... మొత్తం స్లిప్పుల్ని కూడా లెక్కించాల్సిందే... అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తంచేస్తూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వీవీపాట్ స్లిప్పులను కూడా అనుమానించే విధంగా మాట్లాడుతున్నారు. స్లిప్పుల లెక్కింపులో కూడా తన ఓటమి తథ్యమని అర్థమైపోయినట్లుగా ఆయన మాటలు ఉండడం విశేషం.

హైటెక్ ముఖ్యమంత్రిగా తనను ప్రజలందరూ గుర్తించాలని ముచ్చటపడే చంద్రబాబునాయుడు... టెక్నాలజీ విషయంలో తిరోగమన బుద్ధిని చూపిస్తూ.. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నప్పుడే... ఆయనకు ఏపీలో తన ఓటమి తథ్యంగా అర్థమైందని అందరూ తెలుసుకున్నారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారా జగన్ కు అనుకూలంగా మోడీ చక్రం తిప్పిందని పదేపదే ఆరోపణలు చేసిన చంద్రబాబు... దానికి విరుగుడుగా వీవీపాట్ స్లిప్పులను యాభైశాతం లెక్కించాలని... లెక్క సరిపోలితేనే ఫలితం ప్రకటించాలని చాలా ఘనంగా డిమాండ్ చేశారు.

అయితే మొన్నటికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరువాత.. నీరుగారిపోయిన పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి ఆయన ఇప్పుడు కొత్త మార్గం ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేమే గెలవబోతున్నాం. ఏమాత్రం అనుమానం అక్కర్లేదు.. అంటూ చాలా ఘనంగా పలుకుతున్నారు. ఇదంతా పార్టీ రిజల్టుకు ముందే నీరుగారిపోకుండా ఆయన పాట్లు ఆయన పడుతున్నారని అనుకోవచ్చు.

తాజాగా స్లిప్పుల్లో కూడా అక్రమాలు జరగవచ్చుననే అనుమానాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. స్లిప్పులు ఓటరు చేతికి రావాలని, దానిని వారు ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులో వేసేలా మరో పద్ధతి తీసుకురావాలని ... రకరకాల చవకబారు ఐడియాలను ఆయన ప్రతిపాదిస్తున్నారు.

ఈ మాటలన్నీ గమనిస్తోంటే.. ఆయన స్థాయికి అనుచితంగా ఉండే ఒక సామెత గుర్తుకువస్తున్నది. సింపుల్ గా చెప్పాలంటే.. వక్రభాష్యాలు పరనిందలతో సమయం వృథా చేసుకోకుండా.. ప్రజల తిరస్కారాన్ని హుందాగా స్వీకరిస్తే.. చంద్రబాబు నలభయ్యేళ్ల అనుభవానికి గౌరవం నిలుస్తుంది.

ప్రజల్లో మేరానామ్ జోకర్?!

ఎమ్బీయస్‌: బెదురు బాబు

Show comments