బాబు వక్రబుద్ధి: అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు

కోడెల ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలి. ఈ ఒక్క స్టేట్ మెంట్ తో చంద్రబాబు ఎంతకి దిగజారారో పూర్తిగా అర్థమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ మాకొద్దు బాబోయ్ అంటూ సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చేసిన ఘనత చంద్రబాబుది. వాళ్లు వస్తే ఎక్కడ తమ నేతలు అరెస్ట్ అవుతారోనని తెగ భయపడ్డారు బాబు. అలాంటి బాబు ఇప్పుడు పనిగట్టుకుని మరీ సీబీఐ ఎంక్వయిరీ కావాలంటున్నారంటే ఆయన వక్రబుద్ధిని అర్థం చేసుకోవచ్చు.

గత ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై సీబీఐ ఎంక్వయిరీలకు భయపడి దర్యాప్తు సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని, అలాంటి ఎంక్వయిరీ ఏజెన్సీ ఏపీకి అక్కర్లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరి అప్పుడు తప్పుగా కనిపించిన సీబీఐ ఇప్పుడు నిష్పాక్షికంగా ఎందుకు విచారణ చేపడుతుంది. అప్పుడూ ఇప్పుడూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది, చంద్రబాబుకి వారు వైరిపక్షం కాబట్టి నిర్ణయాలు వ్యతిరేకంగానే ఉంటాయని ఊహించాలి. అలాంటప్పుడు బాబు సీబీఐ ఎంక్వయిరీ కోరడం ఎందుకు?

కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే, కోడెల మరణాన్ని మరికొన్ని రోజులు వాడుకోవడం కోసమే చంద్రబాబు సీబీఐ ఎంక్వయిరీ కావాలంటున్నారని అర్థమవుతోంది. ఓవైపు పోస్టుమార్టమ్ రిపోర్ట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలం అన్నీ కోడెల ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఆయన కొడుకు వ్యవహారం ఒక్కటే తేలాల్సి ఉంది. మిస్ అయిన కోడెల ఫోన్ దొరికితే నిజాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ వదిలేసి సీబీఐ విచారణ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు బాబు.

సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్న బాబు.. గతంలో తాను కేంద్ర దర్యాప్తు సంస్థని రాష్ట్రంలోకి రావద్దంటూ తీసుకున్న నిర్ణయం తప్పు అని ఒప్పుకున్నట్టేనా..? అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించడం సరైన నిర్ణయం అని మద్దతు తెలిపినట్టేనా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ తర్వాత బాబు సీబీఐ ఎంక్వయిరీ కోరితే బాగుండేది. ఏదేమైనా ఒక సీనియర్ నాయకుడి మరణాన్ని ఇంతలా రాజకీయం చేస్తున్న దివాళాకోరు రాజకీయ నాయకుడు చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరేమో.

మారని చంద్రబాబు నాయుడు తీరు

Show comments