చైతూ సరసన ఆ హీరోయిన్

తొలిప్రేమ సినిమాతో కొత్తగా కనిపించింది రాశీఖన్నా. స్లిమ్ గా మారి, పెర్ ఫెక్ట్ హీరోయిన్ అని టాక్ తెచ్చుకుంది. అయినా ఇంకా సరైన అవకాశాలు రాలేదు. అయితే లేటెస్ట్ గా ఓ అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది.

వెంకటేష్-చైతన్య కలిసి నటిస్తున్న వెంకీ మామ సినిమాకు హీరోయిన్ కావాలి. ఆ సినిమాలో రకుల్ అనుకుంటే, తేడా వచ్చింది. దాంతో నభా నటేష్ ఆ గ్యాప్ ఫిల్ చేస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ నాగచైతన్య రాశీఖన్నా వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

నాగచైతన్యనే స్వయంగా రాశీఖన్నా పేరును మేకర్లకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే నభానటేష్ బడ్జెట్ వేరు, రాశీఖన్నా బడ్జెట్ వేరు. సినిమాను సమర్పిస్తున్నది సురేష్ బాబు. మరి ఆయన ఏమంటారో? ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చైతన్య సరసన రాశీఖన్నాను చూడొచ్చు వెంకీ మామలో.

రాయలసీమ రైతుల పుండుపై కారం