ఇంటర్నెట్ కు పగ్గాలు వేయబోతున్నారు!

ఇంటర్నెట్ తో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ ఉందని అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇంటర్నెట్ ను, సోషల్ మీడియాను కట్టడి చేయబోతున్నట్టుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి విధానాలను రెడీ చేస్తున్నట్టుగా సుప్రీం కోర్టుకు వివరించింది కేంద్ర ప్రభుత్వం. మరో మూడు నెలల్లో అందుకు సంబంధించి విధానాలు ఖరారు అవుతాయని, వాటిని  కోర్టుకు సమర్పిస్తామని  కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియ జేసింది. వచ్చే ఏడాది జనవరి  కల్లా ఇంటర్నెట్, సోషల్ మీడియా విషయంలో చట్టపరంగా నూతన విధానాలు రాబోతున్నాయని ఇలా తెలిపింది కేంద్రం.

ఇప్పటికే ఇంటర్నెట్ విషయంలో కొన్ని ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా పోర్న్ ను కట్టడి చేశారు. ఈ విషయంలో సెర్చింజన్ తదితరాలకు కూడా కేంద్రం కొన్ని నిబంధనలు పెట్టింది. ఇక సోషల్ మీడియా విషయంలోనూ ప్రభుత్వాలు గట్టిగానే చూస్తూ ఉన్నాయి.

అనుచితమైన, అసభ్యకరమైన పోస్టుల కట్టడికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి. అయినా సముద్రం లాంటి సోషల్ మీడియాలో దేన్నైనా కట్టడి చేయడం అంత సులభం కాదని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇంటర్నెట్ విషయంలో మరికొన్ని నిబంధనలను తీసుకురాబోతున్నట్టుగా, వ్యక్తిగత, ద్వేష దూషణల, అబద్దపు, దేశ వ్యతిరేక పోస్టులను నియంత్రించేలా నూతన విధానాలను అమలు చేయనున్నట్టుగా కేంద్రం చెబుతోంది. మరి కొత్త చట్టాలు ఎలా ఉంటాయో!

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే

Show comments