వర్మకు అసలైన పరీక్ష రేపే

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఇన్నాళ్లూ ఆర్జీవీ చేసిన హంగామా ఒకెత్తయితే, రేపు ఒక్కరోజు మరోఎత్తు. అవును.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రేపు సెన్సార్ ముంగిట వాలనుంది. సెన్సార్ బోర్డ్ అధికారులు ఈ సినిమాను చూసి, సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇవ్వడమేనేది జస్ట్ ఫార్మాలిటీ. అసలు సినిమాను విడుదల చేయాలా వద్దా అనేది రేపు నిర్ణయిస్తారు.

అవును.. ఈ సినిమాపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సెన్సార్ బోర్డుకే అప్పగించింది ఎన్నికల సంఘం. ఓ తెలుగుదేశం కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్, సినిమా చూసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సెన్సార్ ను ఆదేశించింది. అలా రేపు సెన్సార్ అధికారుల ముందుకు రాబోతోంది లక్ష్మీస్ ఎన్టీఆర్.

ఒకవేళ సెన్సార్ బోర్డు ఈ సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఇంతకుముందు ప్రకటించినట్టు 22వ తేదీకి లక్ష్మీస్ ఎన్టీఆర్ ను విడుదల చేయడం టెక్నికల్ గా కుదిరే పనికాదు. అందుకే ఎందుకైనా మంచిదని తన సినిమాను 29కు వాయిదా వేస్తున్నట్టు స్వయంగా వర్మ కొద్దిసేపటి కిందట ప్రకటించాడు.

లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ మలి జీవితాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు వర్మ. ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారు, ఎమ్మెల్యేల్ని తనవైపు తిప్పుకొని ఎలా పార్టీని హస్తగతం చేసుకున్నారు, సొంత కుటుంబ సభ్యులు చివరిరోజుల్లో ఎన్టీఆర్ ను ఎలా కష్టపెట్టారు లాంటి వివాదాస్పద అంశాల్ని ఈ సినిమాలో టచ్ చేశాడు ఆర్జీవీ.

అసలే రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇలాంటి టైమ్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్లలోకి వస్తే చంద్రబాబు పరువు గంగలో కలుస్తుంది. టీడీపీ పుట్టె మునుగుతుంది. అందుకే సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఆపాలని ప్రయత్నిస్తోంది ఆ పార్టీ. ఇటు వర్మ మాత్రం సెన్సార్ బోర్డు ఏమైనా అభ్యంతరాలు తెలిపితే, వెంటనే కోర్టుకెళ్లేందుకు అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నాడు. 

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments