ఉదయాన్నే ఓటేసిన ప్రముఖులు!

రెండోదశ పోలింగ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు. తీక్షణమైన ఎండల నేపథ్యంలో అంతటా ఉదయాన్నే ఓటు వేయడానికి ప్రజలు ముందుకొచ్చారు. కొంతమంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా క్యూల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఎనిమిదిలోపే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రముఖులు ముందుకు రావడం విశేషం. 

-చెన్నై సెంట్రల్ లోక్ సభ సీటు పరిధిలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఆయన స్టెల్లా మేరిస్ కాలేజ్ పోలింగ్ బూత్ లో ఓటేశారు.

-కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే ఉదయాన్నే సోలాపూర్ పరిధిలో ఉదయాన్నే ఓటేశారు. కుటుంబంతో సహా వచ్చి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

-కేంద్ర రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు సౌత్ పరిధిలోకి వచ్చే జయనగర ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

-చెన్నైలోని ఆల్వార్ పేట్ లోని ఒక స్కూల్ లో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూతురు శ్రుతిహాసన్ కూడా కమల్ వెంట వచ్చి ఓటేశారు. ఈ ఎన్నికల్లో కమల్ పార్టీ 'టార్చ్ లైట్' సింబల్ మీద పోటీచేసిన సంగతి తెలిసిందే.

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?