వాదన వీగుతోంది, బాబు మాటలపై సీఈసీ దృష్టి!

-'ముప్పైశాతం ఈవీఎంలు పనిచేయలేదు..' ఇదీ పోలింగ్ నాడు చంద్రబాబు నాయుడు చెప్పినమాట. ఆ తర్వాత మొన్న ఢిల్లీలో 'ముప్పైశాతం ఈవీఎంలు పని చేయలేదు అని జనం అనుకుంటున్నారు..' అని చంద్రబాబు నాయుడు అన్నారు.

-మొదట తను ఇచ్చిన స్టేట్ మెంట్ ను జనాలకు ఆపాదించారు చంద్రబాబు నాయుడు ఈ విషయం గమనార్హం.

-ఇక ఏపీ ఎన్నికల కమిషన్ కు తెలుగుదేశం ఇచ్చిన కంప్లైంట్ లో ఆరు వందలకు పైగా బూత్ లలో ఈవీఎంలు సరిగా పనిచేయలేదని పేర్కొంది.

-అదే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో తెలుగుదేశం పార్టీ మూడు వందల చిల్లర ఈవీఎంలు సరిగా పని చేయలేదని పేర్కొంది.

-సరిగా పని చేయకపోవడం అంటే.. ఆయా బూత్ లతో పోలింగ్ కు కొన్ని అటంకాలు ఏర్పడ్డాయి. వాటికి చాలా రీజన్లున్నాయి. ఏజెంట్లు సకాలంలో రాకపోవడం, మాక్ పోలింగ్ లేట్ కావడం, కొన్ని సాంకేతిక సమస్యలు. వంటి కారణాలున్నాయి.

-'ముప్పైశాతం ఈవీఎంలు పని చేయలేదు..' అని స్టేట్ మెంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున మూడువందల ఈవీఎంల విషయంలో కంప్లైంట్లు వెళ్లడం విశేషం.

-దాదాపు నలభై తొమ్మిదివేల ఈవీఎంలు ఏపీ ఎన్నికలకు ఉపయోగించగా.. అందులో మూడువందల ఈవీఎంలు కాస్తో కూస్తో ఇబ్బంది పెట్టడం అసలు ఏమైనా విషయమా? అనేది కాస్త ఇంగితం ఉన్నవాళ్లు ఎవరైనా వేసే ప్రశ్న.

-ఆ మూడు వందల ఈవీఎంలు కూడా పూర్తిగా ఆగిపోలేదు. వాటిని రిపేర్ చేశారు, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశారు, కాస్తలేట్ అయినా పోలింగ్ పూర్తిచేశారు.

-అంతిమంగా ఐదు బూత్ లలో మాత్రమే పూర్తి ఇబ్బంది కలిగిందని, వివిధ కారణాలతో ఆ ఐదు బూత్ లలో రీపోలింగ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందింది.

-ఇలా వీగిపోయింది తెలుగుదేశం వాదన. ఇక పోలింగ్ బూత్ లలో బాత్రూమ్ లు లేవు, టీ బిస్కెట్లు ఓటర్లకు ఇవ్వలేదు అనేవి నారాలోకేష్ వాదనలు.

-పోలింగ్ బూత్ లు అంటే వాటిని ఈసీ ఏమికట్టించుకోలేదు. ప్రభుత్వ స్కూళ్లలో పోలింగ్ జరిగింది. అలాంటిచోట బాత్రూమ్ లు లేవు? అంటే.. దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలో ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన లోకేష్ కే తెలియాలి. ఇక టీ, బిస్కెట్లు, హెరిటేజ్ మజ్జిగ ఏర్పాటు చేసేపని ఈసీది కాదు అని చినబాబు తెలుసుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

-ఇక చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడి, చివరకు యాభైశాతం వీవీ ప్యాట్ లను లెక్కించాలనే దగ్గరకు వచ్చి ఆగారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ కూడా ఇప్పటికే పూర్తి అయ్యిందని బాబుకు తెలుసో తెలియదో మరి.

-లాస్ట్ బాట్ నాట్ లీస్ట్.. పోలింగ్ కు ముందురోజు చంద్రబాబు నాయుడు వెళ్లి స్టేట్ ఈసీ మీద శివాలెత్తడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు రెచ్చిపోయి ఏమేం మాట్లాడారో.. మొత్తం ట్రాన్స్ లేట్ చేసి తమకు వివరించమని ఏపీ ఎన్నికల కమిషనర్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా? 

Show comments