పాకిస్తాన్ ను సమర్థిస్తున్న చంద్రబాబు?

చంద్రబాబు నాయుడుకు మళ్లీ గోద్రా ఘటనలు గుర్తుకు వచ్చాయి. మొన్నటివరకూ మోడీతో చట్టాపట్టాలేసుకుని తిరిగి, గత ఎన్నికల ముందు మోడీతో కలిసి తన పార్టీని పోటీకి నిలిపి, మోడీ ప్రధాని కావడం దేశానికి అత్యవసరం అని అప్పట్లో ప్రకటించింది.. మోడీ కేబినెట్లో తన పార్టీ ఎంపీలను సైతం ఇద్దరిని పెట్టి.. ఈ మధ్యనే మళ్లీ మోడీ కావాలని ఎన్డీయే మీటింగులో తీర్మానం సైతం పెట్టిన చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు  మళ్లీ గోద్రా గుర్తుకు వచ్చింది.

గోద్రా ఘటనకు మోడీ బాధ్యుడు అని.. రెండువేల మంది మరణానికి మోడీనే కారణమని.. అలాంటి మోడీ ఎంతకైనా తెగించగలడు.. అంటూ చంద్రబాబు నాయుడు అన్నారట. ఈ మేరకు ఆయన తన పార్టీ శ్రేణులతో చేసిన వ్యాఖ్యానాలను మీడియాకు లీకుగా ఇచ్చారు.

మరి గోద్రా ఘటన జరిగింది ఇప్పుడేం కాదు. ఆ ఘటన జరిగిన తర్వాతి ఎన్నికల్లో బాబు బీజేపీతో కలిసే పోటీ చేశారు. ఇక గత ఎన్నికల్లోబీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. అప్పుడు కూడాబాబు వత్తాసు పలికారు. మోడీతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత మోడీతో రాసుకుపూసుకు తిరిగారు. అయితే అప్పుడంతా బాబుకు గోద్రా గుర్తుకు రాలేదు.

ఈ మధ్య మోడీని విలన్ గా చూపి ఏపీలో ఎన్నికలను గట్టెక్కాలని బాబు అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు గోద్రా గుర్తుకు వచ్చింది. అంతేకాదు.. కశ్మీర్ లోని పుల్వామాలో భారత సైన్యం జరిగిన ఉగ్రవాద దాడికి కూడా మోడీనే కారణమని పరోక్షంగా అంటున్నారు చంద్రబాబు నాయుడు. మోడీ ఎంతకైనా తెగించగలడు.. అంటూ బాబు వ్యాఖ్యానించడం వెనుక ఈ అభిప్రాయమే వినిపిస్తోంది. ఈ మేరకు లీకులు ఇస్తున్నారు. 
ఒకవైపు భారత సైన్యం జరిగిన ఘటనపై విచారణ జరిపింది.

దాడికి పాల్పిడింది ఎవరో.. దానివెనుక సూత్రధారులు ఎవరో కూడా సైన్య అధికారులు ప్రకటించారు. ఇది ఆత్మాహుతి దాడి అని స్పష్టం అవుతూనే ఉంది. దీనికి పాల్పడినవాడు వీడియోను కూడా విడుదల చేసుకున్నాడు. ఆత్మాహుతి దాడికిముందే వాడు వీడియో రూపొందించి విడుదల చేశాడు. అంత జరిగితే.. 'మోడీ ఎంతకైనా తెగించగలడు..' అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ ఘటనతో తమకు సంబంధం లేదని అంటున్న పాకిస్తాన్ కూడా ఇలాంటి వాదన చేయడంలేదు. ఆ దేశం దాడితో తమకు సంబంధం లేదని మాత్రమే అంటోంది. అయితే మమతా బెనర్జీ, చంద్రబాబు లాంటి వాళ్లు మాత్రం.. తీవ్రమైన అనుమానాలను వ్యక్తంచేస్తూ ఉన్నారు. దాడితో సంబంధం లేదని పాకిస్తాన్ అంటోందని వీరు ఉటంకిస్తున్నారు. ఈ విధంగా పాకిస్తాన్ తీరును గట్టిగా సమర్థిస్తున్నారు.

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?