నా కూతురు సన్నీలియోన్... వర్మ షార్ట్ ఫిలిం.

"నా కూతురు సన్నీలియోన్ అవ్వాలనుకుంటోంది" రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన లేటెస్ట్ షార్ట్ ఫిలిం ఇది. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం కొద్దిసేపటి కిందట విడుదలైంది. టైటిల్ చూసి చాలామంది షార్ట్ ఫిలింలో బోలెడన్ని సీన్లు ఉంటాయని అనుకున్నారు. "గన్స్ అండ్ థైస్" సిరీస్ ట్రయిలర్ లో నగ్నంగా ఉండే సన్నివేశాల్ని నిర్మోహమాటంగా చూపించాడు వర్మ.

సో.. సన్నీలియోన్ షార్ట్ ఫిలింలో మరిన్ని బూతులు ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఈ షార్ట్ ఫిలిం ద్వారా సెక్స్ పై తన అభిప్రాయాల్ని సూటిగా చెప్పాడు వర్మ.ఓ మధ్యతరగతి అమ్మాయి నేను సన్నీలియోన్ అవుతానంటుంది తన తల్లిదండ్రులతో. కూతుర్ని వాళ్లు మందలిస్తారు. కానీ కూతురు మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉంటుంది. ఈ సందర్భంగా కూతురు పాత్రతో తన మనసులో ఉన్న లాజిక్ మొత్తాన్ని బయటపెట్టాడు వర్మ.

"ఒక్కొక్కరికి ఒక్కో ప్లస్ పాయింట్ ఉంటుంది. నా బాడీ నాకు ఎస్సెట్. దాన్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను. నా లాభం కోసం నేను నా శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నా. ఇందులో తప్పేముంది" షార్ట్ ఫిలింలో అమ్మాయి చెప్పే డైలాగ్స్ ఇవి. 11 నిమిషాల ఈ షార్ట్ ఫిలింలో ఇలాంటి డైలాగ్స్ చాలా పెట్టాడు వర్మ. ఇంతకు ముందు వర్మ తీసిన వంగవీటి సినిమాలో హీరోయిన్ గా చేసిన నైనా గంగూలీ ఈ షార్ట్ ఫిలింలో నటించింది.

Show comments