బన్నీ మాస్ సాంగ్ రెడీ ఫర్ రిలీజ్

సామజవరగమన అనే పాటతో ఒక ఊఫు ఊపేసారు. అల వైకుంఠపురములో ఫస్ట్ సాంగ్ విడుదలై దాదాపు 40 మిలియన్ల హిట్ లకు చేరుకుంటోంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద హిట్ సాంగ్ లేదు. ఇప్పడు ఆ పాట తరువాత మళ్లీ మరో పాట విడుదల చేయాల్సిందే. సినిమా ప్రమోషన్ అన్నాక తప్పదు. కానీ అలా విడుదల చేసే పాట, 'సామజవరగమన' సాంగ్ రేంజ్ కు కాకున్నా, డిస్పపాయింట్ చేయకూడదు.

అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం దీపావళికి బన్నీ సినిమా సాంగ్ మరోటి విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఆ సాంగ్ పక్కా మాస్ మసాలా డ్యాన్స్ నంబర్ అని తెలుస్తోంది. సామజవరగమన సాంగ్ ఎలా అయితే అటు క్లాస్, ఇటు మాస్ జనాలను ఊపేసిందో, ఈ మాస్ నెంబర్ మాస్ జనాలను అలా ఊపేస్తుందని తెలుస్తోంది.

దీపావళికి ముందో, వెనుకో, ఎప్పుడు విడుదలయితే ఇక అప్పటి నుంచి పార్టీ సాంగ్ గా ఆ పాట కొన్నాళ్ల పాటు వినిపిస్తూ వుంటుందని పాట విన్న వర్గాల బోగట్టా. థమన్ సంగీతంలో తయారైన ఈ పాట విడుదలైతే అల వైకుంఠపురములో సినిమా బజ్ మరింత రేంజ్ కు చేరుకుంటుందని అంటున్నారు. ఎలా వుంటుందో వినాలి మరి.

అయితే ఈపాట ట్రాక్ రెడీ అయింది కానీ, ఫైనల్ రికార్డింగ్ చేయలేదని, దీపావళి లోగా అది చేసేయాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

Show comments