బన్నీ కూడా మెగా హీరోనే కదా

మెగా హీరోలు బోలెడు మంది. వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే ఒకప్పుడు పవన్ తరువాత బన్నీనే అన్నంత క్రేజ్ వచ్చింది. కానీ ఆ తరువాత అది తగ్గింది. ధృవ, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ముందు వరుసలోకి వచ్చాడు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, బన్నీకి మధ్యలో అంత మంచి సంబంధాలు లేవు అని గుసగుసలు వినిపించాయి. ఒక టైమ్ లో బన్నీ టీమ్ తన టీమ్ ఒకటి కాకూడదని రామ్ చరణ్, ఛేంజ్ చేసుకున్నారని కూడా వార్తలు వినిపించాయి.

ఇప్పటికీ బన్నీ టీమ్ వేరు. రామ్ చరణ్ టీమ్ వేరు. అలాంటి టైమ్ లో ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ హల్ చల్ చేసినపుడు బన్నీ వెళ్లి మద్దతుగా నిలిచి గ్యాసిప్ లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తరువాత ఒకటి రెండుసార్లు కూడా పవన్ కు మద్దతు పలికారు. ఎన్నికల టైమ్ లో కూడా వెళ్లి కలిసారు.

ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన నిర్మాణంలో మెగా హీరోలు ముగ్గురితో సినిమాలు చేయాలని అనుకుంటున్నారని గ్యాసిప్ లు రావడం ఆలోచింపచేస్తోంది. 'సరైన ప్రాజెక్టులు మీ దృష్టికి వచ్చినపుడు నాకు చెప్పండి.. మనం చేద్దాం' అని పవన్ కళ్యాణ్ వరుణ్, సాయితేజ్, రామ్ చరణ్ లకు చెప్పినట్లు మెగా సర్కిళ్లలో వార్తలు వినిపిస్తున్నాయి.

వాస్తవమా? కాదా? అన్నది అలావుంచితే వినిపించే గ్యాసిప్ ఈ ముగ్గురు మెగా హీరోల గురించే వినిపిస్తోంది కానీ, బన్నీ పేరు వినిపించకపోవడం కాస్త ఆశ్చర్యంగా వుంది. వినిపిస్తున్నవన్నీ ప్యూర్ గ్యాసిప్ లు అయితే సమస్యేలేదు. లేదూ ఎప్పటికైనా నిజాలే అవుతాయి అనుకుంటే మళ్లీ బన్నీ-పవన్ ల మధ్య రిలేషన్ మీద కొత్త గ్యాసిప్ లు ప్రారంభమవుతాయి.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం