బన్నీకి నో చెప్పిన ఆలియాభట్

బన్నీ-దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమా ఐకాన్. ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ వేట ప్రారంభమైంది. ఈ సినిమాకు ఓ రేంజ్ హీరోయిన్ కావాలన్నది బన్నీ కోరికగా తెలుస్తోంది. అది ఏ రేంజ్ అంటే బాలీవుడ్ స్టార్ ఆలియాభట్ కావాలనే రేంజ్. కానీ అదే సాధ్యంకాలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా వున్న ఆలియాభట్ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో మెగా హీరో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కోరిక మేరకు నిర్మాత దిల్ రాజు టీమ్ ఆలియాభట్ ను సంప్రదించినట్లు, అక్కడ నుంచి సానుకూల సమాధానం రాలేదని తెలుస్తోంది.

ఇప్పుడు వేరే ఆల్టర్ నేటివ్ చూస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాకు కూడా హీరోయిన్ల వేట సాగించి, ఆఖరికి పూజాతోనే ఫిక్స్ అయ్యారు. కానీ ఐకాన్ విషయంలో మాత్రం కచ్చితంగా కొత్తగా, క్రేజీగా, ప్రాజెక్టుకు మాంచి బజ్ వచ్చేలా హీరోయిన్ వుండాలని ఫిక్స్ అయ్యారు. సాహో రిజల్ట్ చూసి శ్రద్ధా కపూర్ ను ఏమన్నా ట్రయ్ చేస్తారేమో?

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?