బన్నీకి ఆలియాభట్ కావాలంట

హీరోల కోర్కెలు ఆ రేంజ్ లోనే వుంటాయి. తమ సరసన హీరోయిన్ గా ఫలానా అమ్మాయి కావాలి అని వాళ్లు అడుగుతారు. నిర్మాతలు ట్రయ్ చేసి సినిమా ఫిక్స్ చేస్తారు. తప్పదు మరి. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ గ్యాసిప్ గుప్పుమంటోంది. బన్నీ తను చేయబోయే సినిమాకు ఆలియాభట్ ను హీరోయిన్ గా ట్రయ్ చేయమని ఓ సూచన చేసినట్లు తెలుస్తోంది.

తివిక్రమ్ డైరక్షన్ లో చేసే హారిక హాసిని సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ డైరక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బౌండ్ స్క్రిప్ట్ తో డైరక్టర్ రెడీగా వున్నారు. సినిమా స్టార్ట్ చేస్తే మూడు నెలల్లో తీసి పక్కన పెట్టడమే. అందుకే ఈ సినిమాకు ఇప్పటి నుంచే అన్నీ రెడీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బన్నీ తన సినిమాకు హీరోయిన్ గా ఆలియాభట్ ను ట్రయ్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మరే నిర్మాత అయినా బాలీవుడ్ జనాలను పట్టుకుని, కిందామీదా పడి ఆలియాభట్ ను ఫిక్స్ చేస్తారు. కానీ దిల్ రాజు ఏం చేస్తారు అన్నది చూడాలి.

ఆలియా ఆర్ఆర్ఆర్ సినిమాకు అయిదుకోట్లు పారితోషికం తీసుకున్నట్లు బోగట్టా. మరి బన్నీ సినిమా అన్నా అంతే వుంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి.

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను