బ్రేకప్ ఎఫెక్ట్: తొలగించారా? తప్పుకుందా?

తెలుగులో వరుసగా వస్తున్న అవకాశాల వల్ల ఆమె శాండిల్ వుడ్ కు దూరమవ్వడం లేదు. కన్నడ నటుడు రక్షిత్ తో పెళ్లిని రద్దుచేసుకున్నందుకు ఆమె కన్నడ చిత్రపరిశ్రమకు దూరమౌతోంది. ప్రస్తుతం కన్నడనాట మొత్తం ఇదే చర్చ నడుస్తోంది. 

రీసెంట్ గా రష్మిక ఓ కన్నడ సినిమా నుంచి తప్పుకుంది. అయితే తను స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు రష్మిక సోషల్ మీడియాలో చెప్పుకున్నప్పటికీ, ఆమెను తప్పించారంటోంది కన్నడ మీడియా. గౌతమ్ దర్శకత్వంలో ఓ కన్నడ సినిమా చేసేందుకు ఆమె గతంలోనే అంగీకరించింది. లెక్కప్రకారం, వచ్చే నెల నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. 

కానీ రక్షిత్, గౌతమ్ మంచి ఫ్రెండ్స్. ఎప్పుడైతే రక్షిత్-రష్మిక పెళ్లి రద్దయిందో, అప్పుడే ఈ ప్రాజెక్టు నుంచి రష్మికను బయటకు పంపేస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. తాజాగా అదే జరిగింది. గౌతమ్ డైరక్ట్ చేస్తున్న సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది రష్మిక. అయితే ఆమె తప్పుకోలేదని, సినిమా యూనిట్టే ఆమెను తొలిగించారంటూ కన్నడనాట వార్తలు వస్తున్నాయి.

రక్షిత్ తో పెళ్లి రద్దు చేసుకున్న కారణంగా రష్మికకు కన్నడనాట కెరీర్ చాలా కష్టమనేది అక్కడి విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ఈ విషయంలో రష్మిక అస్సలు ఫీల్ అవ్వడంలేదు. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, కుదిరితే కోలీవుడ్ లో అడుగుపెట్టాలని భావిస్తోంది. 

Show comments