ఎల్టీటీఈ తర్వాత.. శ్రీలంకపై ఉగ్రపంజా.. ఇప్పుడెవరు?

శ్రీలంకకు ఉగ్రపంజా కొత్త కాదు. గతంలో తమిళపులులు లంకలో భారీ విధ్వంసాలకు పాల్పడ్డారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళఈలం(ఎల్టీటీఏ) లంకను ముప్పుతిప్పలు పెట్టింది. అప్పటివరకూ ప్రపంచం ఎరగని ఆత్మాహుతి దాడులు కూడా శ్రీలంకలోనే చోటు చేసుకున్నాయి. తమిళ ఈలం డిమాండ్ తో దశాబ్దాల పాటు ఎల్టీటీఈ పోరాటం సాగింది. తమిళ టైగర్లను అణిచివేయడానికి శ్రీలంక ప్రభుత్వాలు కూడా అదే స్థాయిలో స్పందించాయి. భారీస్థాయి మిలటరీ ఆపరేషన్లతో తుదకు ఎల్టీటీఈని తుడిచిపెట్టింది శ్రీలంక.

పులి ప్రభాకరన్ ను హతం చేయడంతో శ్రీలంక ఎల్టీటీఈని తుడిచి పెట్టింది. ఆఖరికి ప్రభాకరన్ కొడుకును చిన్నవయసు వాడైనా దారుణంగా చంపేసింది లంక ప్రభుత్వం. భవిష్యత్తుల్లో మళ్లీ తమిళ ఈలం సమస్య తలెత్తకుండా లంక కూడా అలా దుర్మార్గంగానే వ్యవహరించింది.

అలా ఉగ్రభూతం నుంచి శ్రీలంక కొద్దోగొప్పో సేఫ్ గా నిలిచింది. అలా ప్రశాంతంగా కనిపిస్తున్న లంక భగ్గుమంది. ఈస్టర్ రోజున భారీఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది. సీరియల్స్ బ్లాస్ట్ తో శ్రీలంక వణికిపోయింది. చర్చీలు, హోటళ్లు లక్ష్యంగా చేసుకున్న ఈ పేలుళ్లలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య రెండు వందలకు పైనే అని తేలింది. ఇంకా అనేకమంది గాయాలపాలయ్యారు.

ఊహించని ఈ విధ్వంసంతో లంక వణికిపోతోంది. ఈ సంఘటనను భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ సంఘటనకు బాధ్యులను ఇప్పటికే గుర్తించినట్టుగా ఏడు మందిని అరెస్టు చేసినట్టుగా కూడా లంక పోలీసులు ప్రకటించారు. లంకలో చోటు చేసుకున్న పేలుళ్లు భారత్ ను కూడా అలర్ట్ గా ఉండమనే సంకేతాలను ఇస్తున్నట్టున్నాయి.

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

Show comments