బీజేపీ ఆఫర్.. టైమ్ కోరిన వైఎస్ జగన్

లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చింది నిజమేనని తెలుస్తోంది. విపక్ష పార్టీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం దక్కనుందని సమాచారం. గత పర్యాయం అన్నాడీఎంకేకు ఆ అవకాశం ఇచ్చింది మోడీ సర్కారు.

జయలలితతో సత్సంబంధాలు కోరుకుంటూ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆ అన్నాడీఎంకే ఎంపీకి ఇచ్చింది కమలదళం. ఈసారి కూడా ఒక ప్రాంతీయ విపక్ష పార్టీకి ఆ అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది.

ఈ పదవిని శివసేన కోరుతూ ఉంది. అయితే బీజేపీ ఆ విషయంలో స్పందించడం లేదు. బీజేడీ , జేడీయూలను కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకున్నారట మోడీ, షా. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే ఉద్దేశం కూడా ఉందట. ఈ విషయంలో కమలనాథులు బయటకు ఏదీ చెప్పడంలేదు. తమకు తగిన పార్టీని ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు.

డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేయగా, ఆ పార్టీ  అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో నిర్ణయానికి కాస్త సమయం కావాలని కోరినట్టుగా సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడమా, వద్దా అనే అంశం గురించి జగన్ సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం