బీజేపీకి పాకిన ఆకర్ష్ వైరస్

మొదట టీఆర్ఎస్ కు బలంగా సోకిన ఆకర్ష్ వైరస్ తర్వాత టీడీపీకి చేరింది. ఈ రెండు పార్టీల నుంచి ఇప్పుడు బీజేపీకి చేరింది. చిత్రమేమిటంటే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలని భావిస్తోంది. అంటే ఈ వైరస్ ను అది ముందుగా తెలంగాణలో ప్రయోగించాలి. కానీ కేసిఆర్ దగ్గర పప్పులు ఉడకడం అంటే కష్టం. అలా అని బాబుదగ్గర ఉడకబెట్టాలని చూడడం లేదు. ఆంధ్రలో వైకాపాలో మిగిలిన జనం, కాంగ్రెస్ లోంచి కదలలేకపోతున్న జనం వున్నారు. అందుకే ఈ ఆకర్ష్ మంత్రాన్ని తను కూడా జపించి, ఆంధ్రలో తమ మితృడు చంధ్రబాబుకు వీలయినంత సాయం చేయాలని చూస్తోంది. 

పొరపాటును ఇదే మంత్రం తేదేపాకు సోకి, ఏమైనా తేడా వస్తుందేమో అని ముందే జాగ్రత్త పడిపోతోంది. మిత్ర పక్షం జోలికి మాత్రం వెళ్ల వద్దని కండిషన్ పెట్టేస్తోంది. అంటే భాజపా తలుపులు వైకాపా, కాంగ్రెస్ వారి కోసమే తెరుస్తారన్నమాట.  అదే తెలంగాణలో బీజేపీ ఆకర్ష్ ప్రయోగిస్తే ఇలాంటి ఇబ్బంది ఏమీ లేదు. పైగా మిత్రపక్షం టీడీపీకూడా సహకరిస్తుంది. అలా కాక ఏపీలో మొదలుపెట్టాలని చూస్తోందంటే బీజేపీ మదిలో ఏమి ఆలోచనలు వున్నాయో మరి? కానీ చిత్రమేమిటంటే, ప్రత్యేకంగా టీడీపీలో వుండలే్ం..బయటకు వెళ్లిపోతాం అని ఎవరైనా అంటే మాత్రం వారిని తీసుకోండటనే చిన్న సూచన కూడా వచ్చేసింది. 

తెలంగాణలో పర్యటన ముగించి ఏపీకి వెళ్లిన పార్టీ జాతీయాధ్యక్ష్యుడు అమిత్ షా అక్కడ పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంతే కాదు ఆపార్టీలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైనది ఆకర్ష్. మిత్రధర్మాన్ని పాటించాలన్నారు.. అదే సమయంలో పార్టీ ఏపీలో బలపడాలని చెప్పారు. పార్టీని మరింత విస్తరించాలని చెప్పారు. ఏ పార్టీ నుంచి వచ్చినా బీజేపీలో చేర్చుకోవాలని తెలిపారు.  ఆకర్ష్ పతకం అమలుకు ప్రత్యేకంగా ఓ కమిటీనే ఏర్పాటు చేశారు. అంటే ఏపీలో రాజకీయాలు మరో కొత్త మలుపు తిరుగుతుందన్న మాట.

Show comments