స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ వాయిదా

లెక్కప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలకావాలి. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు అస్తమయంతో టాలీవుడ్ మూగబోయింది. ఆయన మృతికి సంతాప సూచకంగా స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. వాయిదా వేయడంతో పాటు కొత్త తేదీని కూడా ప్రకటించారు మేకర్స్.

ఒక రోజు ఆలస్యంగా స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలకానుంది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఏటా తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు, తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక హంగామా చేయడం మహేష్ కు అలవాటు. ఈ ఏడాది స్పైడర్ టీజర్ విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ దాసరి హఠాన్మరణంతో అది సాధ్యం కాలేదు.

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీకి సంబంధించి 2 పాటలు, కొంత యాక్షన్ పార్ట్ మినహా టాకీ పార్ట్ పూర్తయింది. రాబోయే 2 వారాల్లో ఈ మొత్తం షూటింగ్ ను కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది యూనిట్. స్పైడర్ కంప్లీట్ అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే ప్రారంభమైన సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడు మహేష్.

Show comments