బెల్లంకొండ ధీమా ఏమిటి?

బెల్లంకొండ శ్రీనివాస్ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రం కవచం. ఈ సినిమా టీజర్ విడుదలైంది. బాగుందని అందరూ అంటున్న టైమ్ లోనే, విడుదల డేట్ కూడా ఇచ్చేసారు. డిసెంబర్ 7న విడుదల అంటూ ప్రకటించేసారు. వాస్తవానికి ఈ సినిమా వర్క్ ఇంకా పూర్తికాలేదు. డిసెంబర్ 7 అంటే కాస్త హర్రీ హర్రీగా రెడీ కావాల్సిందే.

అది అలా వుంచితే, అంతకు ముందువారం, అంటే నవంబర్ నెలాఖరున రజనీ కాంత్ - శంకర్ ల భారీ సినిమా రోబో 2.0 సినిమా విడుదల వుంది. తెలుగులోనే 80 కోట్ల విలువైన సినిమా ఇది. సినిమా ఏమాత్రం బాగున్నా, జనం బారులు తీరతారు. అంటే మలివారం థియేటర్లలోంచి తీయమన్నా తీయరు.

మరి ఇలాంటి నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను రోబో 2.0కు వారం గ్యాప్ లో ఫిక్స్ చేయడం అంటే దానివెనుక థీమా ఏమనుకోవాలి? తమ సినిమా కంటెంట్ మీద నమ్మకమా? రజనీ సినిమా మీద అనుమానమా?

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments