బయటకు వస్తున్నది దేవి నాగవల్లి?

అందరూ అనుకున్నట్లు, ఊహిస్తున్నట్లు జరగడం లేదు ఈవారం బిగ్ బాస్ నుంచి మొహబూబ్ బయటకు వస్తారని గ్యాసిప్ లు వినిపించాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం వేరుగా వుంది. టీవీ 9 రిపోర్టర్ దేవీ నాగవల్లి ఈ వారం ఎలిమేనేషన్ కు గురవుతున్నారని తెలుస్తోంది. 

తొలివారం నుంచే దేవీ నాగవల్లి బిగ్ బాస్ షో లో ఇమడలేకపోతూ వస్తున్నారు. దాదాపుగా ఆమెను మిగిలిన అమ్మాయిలు అంతా దూరం పెట్టినట్లు కనిపించింది. బహుశా వయసు తేడా, ప్రొఫెషన్ తేడా కూడా ఇందుకు కారణమై వుండొచ్చు. ఓ జర్నలిస్ట్ గా ఇన్నాళ్లూ వుంటూ, బిగ్ బాస్ షోలో అచ్చిక బుచ్చిక కబుర్లు చెప్పడానికి అలవాటు పడడం దేవికి కష్టం అయినట్లు కనిపిస్తోంది. దానికి అలవాటు పడేలోగానే మిగిలిన వారు అంతా ఒక పక్కకు చేరిపోయారు. 

మరోపక్క దేవి కోసం షో బయట కూడా ప్రమోషన్ వ్యూహం రచించినట్లు కనిపిస్తోంది. తొలిసారిగా ఆమె దర్శకుడు దాసరి చుట్టం అనే విషయాన్ని వ్యూహాత్మకంగా ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ ద్వారా బయటకు తెచ్చారు. దేవీ ది కూడా పాలకొల్లు అని, దాసరి చుట్టం అని ఇలా చెప్పించడం ద్వారా ఓ వర్గం ఓట్లు గట్టిగా రాబట్టుకోవచ్చనే ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. 

కానీ అదేమంత ఫలితం ఇచ్చినట్లు లేదు. అందుకే దేవీ నాగవల్లి బయటకు వస్తుందని గట్టి గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సాయంత్రం దేవీ నాగవల్లి బయటకు వస్తుందో? మెహబూబ్ వస్తారో? మరెవరు వస్తారో?

విశాఖ‌కే అన్ని కావాలంటున్న విజ‌య‌సాయిరెడ్డి!

Show comments