అల్లుడు తుస్సుమనిపిస్తే... మామ ఏకంగా పరార్

ప్రజల్లోనే కాదు, తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే చర్చ..
ఓవైపు లోకేష్ పోటీకి పనికిరాని పుంజుగా మారితే... లోకేష్ మామ, టీడీపీ "స్టార్" ఎట్రాక్షన్ బాలయ్య అయితే ఏకంగా పోటీకి భయపడి పరారయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. మంచికో చెడుకో పల్నాడు దాడుల అంశాన్ని తెలుగుదేశం పార్టీ భుజానికెత్తుకుంది. దానివల్ల అది లాభపడిందా లేక ఉన్న ప్రతిష్టను ఊడగొట్టుకుందా అనే చర్చను పక్కనపెడితే.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంశాన్ని తీసుకుంది టీడీపీ. మరి అలాంటి కీలకమైన కార్యక్రమానికి బాలయ్య రావాలి కదా. అప్పుడే కదా మైలేజీ. కానీ అలాంటిదేం జరగలేదు.

తనకు తాను బృహత్తర కార్యక్రమంగా భావించి ఈ అంశాన్ని లేవనెత్తారు చంద్రబాబు. తన మీడియా చాతుర్యం మొత్తం ఉపయోగించారు. ఒకదశలో నేషనల్ మీడియాను కూడా కెలికారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న నేతలందర్నీ దించారు. కానీ తన ఇంట్లో మనిషి బాలయ్యను మాత్రం ఆయాచితంగా మరిచిపోయారు. చంద్రబాబు మరిచిపోయారు అనేకంటే బాలయ్య డుమ్మాకొట్టాడని చెప్పడం కరెక్ట్.

టీడీపీ అధికారంలోకి రాకపోయేసరికి తానిక ప్రజాప్రతినిధిని కాదన్నట్టు వ్యవహరిస్తున్నాడు బాలయ్య. ఓవైపు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆ విషయాన్ని మరిచినట్టున్నాడు. ఎంచక్కా సినిమా షూటింగ్స్ తో గడిపేస్తున్నాడు. మొన్నటికిమొన్న విదేశాల్లో ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో మరో షెడ్యూల్ షురూచేశాడు. సాయంత్రం ఇంటికొచ్చి చల్లగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఓవైపు టీడీపీ నేతలంతా "ఛలో ఆత్మకూరు" అంటూ నానాహంగామా చేస్తుంటే.. బాలయ్య మాత్రం ఇలా కూల్ గా కాలక్షేపం చేస్తున్నాడు.

బాలయ్య వ్యవహారశైలిపై సొంత పార్టీలోనే చీదరింపులు, కామెంట్స్ వినిపిస్తున్నాయి. పార్టీలో అంతోఇంతో ఛరిష్మా ఉన్న బాలయ్య లాంటి వ్యక్తుల్ని ఇలాంటి టైమ్ లో రంగంలోకి దింపకపోతే ఇంకెందుకంటూ చంద్రబాబును ఆడిపోసుకుంటున్నారు టీడీపీ నేతలు. ప్రస్తుతం బాలయ్యకు రాష్ట్ర సమస్యల కంటే తన సినిమాలే ఎక్కువయ్యాయని విమర్శిస్తున్నారు. అంతేకాదు.. ఈ ఐదేళ్లు బాలయ్య కేవలం పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మాత్రమే వ్యవహరిస్తారని, స్వయంగా ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.

మీటింగ్స్ లో బాలయ్య అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి "వాట్ ఐయామ్ సేయింగ్" అంటూ ఏదో ఒక స్టోరీ అందుకున్నారట చంద్రబాబు. అయితే పసుపు పార్టీలో మరికొందరు మాత్రం బాలయ్య రాకపోవడం మంచిదైందంటున్నారు. బాలయ్య గైర్హాజరీ వల్లనే అంతోఇంతో అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టుగా జరిగిందని వాదిస్తున్నారు. చినబాబు రాకతో సీరియస్ నెస్ కాస్త తగ్గిందని, బాలయ్య కూడా వచ్చి ఉంటే మామ-అల్లుళ్లు ఇద్దరూ కలిసి ఛలో ఆత్మకూరును ఎక్స్ ట్రా జబర్దస్త్ గా మార్చేసి ఉండేవారని అభిప్రాయపడ్డారు. 

నీ సినిమా గురించి అడిగి కడిగి పారేస్తా.. హీరో

Show comments