కూటమికి శుభవార్త.. ఆయన ప్రచారానికి రావట్లేదు!

అటు చంద్రబాబు నాయుడు పేరు, ఇటు బాలయ్య పేరు.. తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లేనట్టుగా వార్తలు రావడం ఆసక్తిదాయకంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం చేయడం విషయంలో బాబు ఇప్పటికే చేతులు ఎత్తేశాడు.

తను ప్రచారానికి రాను అని మొదట్లోనే తన పార్టీ నేతలకు బాబు స్పష్టంచేశాడు. అయితే ఆ తర్వాత మహాకూటమి ఏర్పాట్లు అయ్యాకా.. రాహుల్ తో కలిసి బాబు రోడ్ షోలు అని లీకులు ఇచ్చారు. హైదరాబాద్ పరిధిలో బాబు అలాంటి ప్రచారం చేస్తారని ప్రకటించారు.

కట్ చేస్తే టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చంద్రబాబు పేరు లేకపోవడం విశేషం. అంతేకాదు.. ఈ జాబితాలో నందమూరి నటసింహం పేరు కూడా లేదు. తను మహాకూటమి తరఫున ప్రచారం చేస్తానని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేస్తానని బాలయ్య ప్రకటించాడు. కానీ.. చివరకు బాలయ్య పేరు కూడా జాబితాలో కనిపించలేదు. బాబు సంగతేమో కానీ.. బాలయ్య పేరు జాబితాలో లేకపోవడం పట్ల మహాకూటమి అభ్యర్థులు ఖుష్ అవుతున్నారు.

బాలయ్య ప్రచారానికి వస్తే ఓట్లు పడటం సంగతేమో కానీ.. ఆయన రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుంది. బాలయ్య ప్రచారానికి వచ్చాడంటే.. కార్యకర్తల చెంపలు పగడాలు జరగొచ్చు, బాలయ్య కాలెత్తి వాళ్లను తన్ననూ వచ్చు.

అభిమానులపై అలా ప్రేమను ఒలకపోయడం నటసింహానికి రొటీనే కదా. అసలే ఇది తెలంగాణ. ఇలాంటి సమయంలో బాలయ్య అలాంటి అలజడి రేపితే కూటమికే ఎసరు  వస్తుంది. అందుకే.. తెలంగాణ తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బాలయ్య లేకపోవడం కూటమికి ఊరట!

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments