బాలయ్య దసరా స్టిల్

బాలయ్య లేటెస్ట్ గెటప్ అంటూ ఈ మధ్య కొన్ని సూపర్ మేకోవర్ స్టిల్స్ కొన్ని బయటకు వచ్చాయి. చూసిన వాళ్లంతా అహో... సూపర్.. మేకోవర్ అన్నారు. అయితే ఇది వేరే.. ఒరిజినల్ లోపల అలాగే వుంది, అంటూ ఓ మాస్ స్టిల్ ను ఇప్పుడు దసరా సందర్భంగా విడుదల చేసారు. ఆ స్టిల్ అచ్చంగా దసరా కోసమే తయారుచేసి విడుదల చేసినట్లుంది.

బాలయ్య మాంచి వేట కత్తి చేతిలో పట్టుకుని వున్నారు. ఒంటి నిండా పసుపు కుంకాలే. అమ్మోరు తల్లి ఏవిధంగా అయితే వేట కత్తి పట్టుకుని, వంటి నిండా పసుపు కుంకుమలతో వుంటుందో, బాలయ్య ఆ సింబాలిక్ అన్నట్లు వున్నారు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ విడుదల లక్ష్యంగా ఈ సినిమా తయారవుతోంది. ఈసినిమాలో బాలయ్య పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. అయితే అదే సమయంలో కొంత సినిమా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో కూడా వుంటుంది. ఆ విధంగా సినిమాలో బాలయ్య రెండు షేడ్స్ లో కనిపిస్తారు.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!