మహేష్ సెంటిమెంట్ కి మహర్షి బ్రేక్ వేస్తాడా..?

మైలురాళ్లు.. గతంలో యాభయ్యో.. వందో సినిమానో మైలురాయిగా చెప్పుకునేవారు. ఇప్పుడు మన హీరోలు చేస్తున్న సినిమాల నెంబర్ చూస్తే.. 5, 10, 15, 20.. ఇలా అన్ని సినిమాలనూ మైలురాళ్లుగా పరిగణలోకి తీసుకోవాలి. అలా చెప్పుకుంటూ వస్తే మహేష్ బాబు హీరోగా ఇప్పుడు 25వ మైలురాయి దగ్గర ఆగాడు.

మహేష్ 25వ సినిమాగా మహర్షి రిలీజ్ కి ముస్తాబైంది. అయితే ప్రిన్స్ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఈ 25వ మైలురాయి పెద్దగా వర్కవుట్ అయ్యేలా కనిపించట్లేదు. మహేష్ 5వ సినిమా టక్కరిదొంగ, పదో మూవీ అర్జున్, పదిహేనో సినిమా ఖలేజా, ఇరవయ్యో సినిమా ఆగడు... ఇవన్నీ చూస్తే మహర్షి కూడా ఎక్కడో తేడాకొడుతున్నట్టు అనిపిస్తుంది.

టక్కరిదొంగ, అర్జున్, ఖలేజా, ఆగడు.. ఇవన్నీ సూపర్ స్టార్ కెరీర్ లో పరాజయాలుగా మిగిలిపోయాయి. ఏదో అనుకుని తీస్తే.. ఇంకేదో అయిన సినిమాలివి. విడుదలకు ముందు భారీ హైప్ తో వచ్చి విడుదల తర్వాత మహేష్ ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేశాయి. సరిగ్గా ఆ లెక్క ప్రకారం మళ్లీ ఐదు సినిమాల గ్యాప్ తో మహర్షి వస్తోంది. ఈసారి కూడా భారీ హైప్ ఉంది.

ముచ్చటగా ముగ్గురు నిర్మాతలు చేతులు వేసి తీసిన సినిమా ఇది. వంశీ పైడిపల్లి అత్యంత నింపాదిగా చెక్కిన ప్రాజెక్ట్. కొత్త సబ్జెక్ట్, గొప్ప సబ్జెక్ట్ అంటూ హడావిడి చేశారు. అయితే టీజర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు, అదే కోవలో విడుదలైన ఆడియో సాంగ్స్ కూడా ఎవర్నీ ఇంప్రెస్ చేయలేదు.

ఇన్ని నెగెటివ్ సెంటిమెంట్లు ఉన్నా కూడా మహర్షి హిట్ అయితే వంశీ నిజంగా అదృష్టవంతుడే అనుకోవాలి. మహర్షి మూవీ, మహేష్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. 

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?

Show comments