బ్యాచులర్ తొలి రోజు బాగున్నాడు

మాంచి బజ్ తో విడుదలయిన సినిమా బ్యాచులర్. దసరా నాడు జనాలకు మాంచి క్రేజీ ప్రాజెక్ట్ గా కనిపించింది. పూజా హెగ్డే మెయిన్ అట్రాక్షన్ గా వున్న ఈ సినిమాకు లెహరాయి పాట కూడా జనాలను తీసుకురావడానికి పని కొచ్చింది.

సినిమా ఎలా వుంది. మంచి చెడ్డలు పక్కన పెడితే తొలి రోజు మాంచి వసూళ్లు కళ్ల చూసింది. నూరు శాతం ఆక్యుపెన్సీ,సెకెండ్ షో లు కలిసి వచ్చాయి.ఇదే రేట్లు కూడా వుండి వుంటే ఇంకా మంచి ఫిగర్లు కనిపించేవి.

ప్రస్తుతానికి వివిధ సోర్స్ ల ద్వారా సేకరించిన కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.  శని, ఆదివారాలు కూడా సెలవు రోజులే కనుక, ఈ జోష్ ఇలా కొనసాగితే ఫస్ట్ వీకెండ్ లో 10 నుంచి 12 కోట్లకు పైగా కోట్ చేసే అవకాశం వుంది. నాన్ థియేటర్ ఆదాయం పోనూ 11 కోట్ల థియేటర్ కలెక్షన్లు టార్గెట్ తో ఈ సినిమా విడుదలయింది. 

తొలి రోజు వసూళ్లు ఇలా వున్నాయి

Nizam 1.76, Ceeded 1.10, East 30, West 28, Krishna 31, Vizag 56, Guntur 50, Nellore 23, Over seas - 235k

Show comments