వైరల్ పోస్ట్.. ఆనందంలో దేవాన్ష్

ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఆయన మనవడు పార్క్ లో సరదాగా ఆడుకుంటున్న ఓ ఫొటో వైరల్ అయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ పోస్ట్ పై చాలా కామెంట్స్ పడ్డాయి. మా తాతతో కలిసి రోజంతా ఆడుకునే ఛాన్స్ ఇవ్వు జగన్ అంటూ దేవాన్ష్ కోరుతున్నట్టుగా చాలా పోస్టులు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు ఓడిపోవడంతో మరోసారి అప్పటి పిక్ ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

"డియర్ జగన్, మా తాతను నాకు తిరిగిచ్చినందుకు థ్యాంక్ యు. ఇకపై పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి రాత్రి వరకు మా తాతతో ఎంచక్కా ఆడుకుంటాను. ఇప్పుడే కాదు, మరో 10-12 ఏళ్ల వరకు మా తాతతో నేను ఇలానే ఆడుకునేలా చూడవా ప్లీజ్."

చంద్రబాబు-దేవాన్ష్ ఫొటోలకు ఇలాంటి ఫన్నీ కామెంట్స్ జోడించి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. ఇన్నాళ్లూ అధికారులు, మంత్రులకు క్లాసులు పీకినట్టు దేవాన్ష్ కు కూడా చంద్రబాబు క్లాసులు పీకుతున్నట్టు.. దేవాన్ష్ తో మూడో కూటమి గురించి చర్చలు జరుపుతున్నట్టు.. దేవాన్ష్-బాబు కలిసి పోలవరం గట్టున ఆడుకుంటున్నట్టు.. ఇలా కేవలం ఆ ఒక్క ఫొటోతోనే రకరకాలుగా కార్టూన్లు తయారైపోయాయి.

ఇక వాస్తవ పరిస్థితికి వస్తే.. నిజంగానే ఏం చేయాలా అనే ఆలోచనలో పడిపోయారు చంద్రబాబు. కేంద్రంలో తిప్పుదామనుకున్న చక్రం విరిగిపోవడం, రాష్ట్రంలో టీడీపీ, మరో కాంగ్రెస్ పార్టీలా తయారవ్వడంతో డైలమాలో పడ్డారు. గెలిచిన కొద్దిపాటి ఎమ్మెల్యేలతో చిన్న మీటింగ్ పెట్టి అనుకూల మీడియా సహాయంతో మరోసారి వార్తల్లో నలుగుదామని ప్రయత్నించారు. కానీ ఓ 10 రోజుల పాటు సైలెంట్ గా ఉండమని బాబు మీడియా అతడికి సూచించిందట.

మరోవైపు ఇప్పటికిప్పుడు మీటింగ్ పెడితే వచ్చేది లేదని, మీడియా ముందుకు రావడానికి సిగ్గుగా ఉందంటూ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుకు సందేశం పంపించారట. దీంతో సోషల్ మీడియా పోస్టుల్లో చెప్పినట్టు, చంద్రబాబుకు ఇప్పుడు మిగిలిన ఏకైక ఆప్షన్ దేవాన్ష్ మాత్రమే.

సినిమా రివ్యూ: సీత