చంద్రబాబు హామీ జగన్ అమలు చేయాలా

చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడతారని.. ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. ఫలితాలు తేడాకొట్టిన తర్వాత ఆయన మానసిక స్థితి మరింత క్షీణించిందని చెబుతారు కొందరు. తాజాగా సీఎం జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలపై బాబు స్పందన చూస్తే, అదే అనుమానం అందరికీ కలుగుతుంది.

రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతోందని, జగన్ నిర్ణయాలతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఏదేదో మాట్లాడుతున్నారు బాబు. జగన్ పాలనపై తొలిసారి స్పందించిన ఆయన.. తన అక్కసునంతా వెళ్లగక్కారు. సీఎం జగన్ పాలనపై తొలిసారి స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అభివృద్ధిని ఆపొద్దంటూ మొసలికన్నీరు కార్చారు.

అక్కడికేదో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్టు.. కొత్త ప్రభుత్వ నిర్ణయాలు వాటికి ఆటంకం కలిగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఫలితాలు వచ్చాక అమరావతికి వచ్చే పెట్టుబడులు అగిపోతున్నాయని కూడా అసంబద్ధంగా మాట్లాడారు. రైతులకు రెండు విడతల రుణమాఫీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన చంద్రబాబుకి అసలు రుణమాఫీ హామీ ఎవరు ఇచ్చారు, గత ఐదేళ్లలో ఎందుకు రుణమాఫీ సొమ్ము ఇవ్వలేదో తెలియదా?

ఇలా తాను చేసిన తప్పులన్నిటినీ కొత్త ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారు బాబు. ఓవైపు తను రాష్ట్రాన్ని దగ్గరుండి దివాళా తీయించినా.. జగన్, ఉద్యోగుల జీతాలు పెంచడం, కొత్త పథకాలు ప్రకటిస్తుండటంతో బాబు మతి పోతోంది. అందుకే ఇలా తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అద్భుతమని అందరూ మెచ్చుకుంటుంటే.. చంద్రబాబుకి మాత్రం అది కంటగింపుగా మారింది. ఈ పద్ధతితో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయని అన్నారు.

జగన్ ప్రకటించిన రైతు భరోసా కంటే.. చంద్రబాబు అన్నదాత సుఖీభవే గొప్పదట. ఉండవల్లిలో పార్టీ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు.. ఇలా తొలిసారి జగన్ పాలనపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. దీనంతటికీ కారణం ఒక్కటే. తనుచేసిన అవినీతి బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని బాబు భయం. ఆరోజు ఎంతో దూరంలో లేదనేది విశ్లేషకుల మాట.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్