బాబు సొంత డబ్బా.. గడ్డిపెట్టిన నెటిజన్లు

"ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజుల పైనే సమయం ఉంది. ఎన్నికల ఫలితాల కోసం నేను ఎదురుచూడటం లేదు. అప్పటివరకు సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ప్రజల అవసరాలు-రాష్ట్రాభివృద్ధి నాకు ముఖ్యం."

కొన్ని గంటల కిందట చంద్రబాబు పెట్టిన ట్వీట్ ఇది. దీనిపై ఇప్పుడు నెటిజన్లు భగ్గుమంటున్నారు. కొందరు చంద్రబాబును సీరియస్ గా విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని గాలికొదిలేసి, చివరి ఈనెల రోజులు పనిచేస్తావా బాబు అని కొందరు ప్రశ్నిస్తే.. కనీసం ఈనెల రోజులైనా పనిచేయమని మరికొందరు చురకలంటించారు.

చంద్రబాబు పెట్టిన ఈ ట్వీట్ పై 70శాతానికి పైగా నెటిజన్లు బై బై బాబు అని స్పందిస్తే, మిగతా జనాలంతా గుడ్ జోక్ అంటూ రీట్వీట్ చేయడం విశేషం. దీనికితోడు ప్రస్తుతం నడుస్తున్న క్రికెట్ సీజన్ కు తగ్గట్టు కూడా బాబుపై సెటైర్లు పడ్డాయి. ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని, ఆల్రెడీ క్లీన్ బౌల్డ్ అనే అర్థంవచ్చేలా బాబుపై కార్టూన్లు, మార్ఫింగ్ ఫొటోలు లెక్కలేనన్ని పుట్టుకొచ్చాయి.

ఓవైపు ఈవీఎంలు పనిచేయలేదంటూ ఢిల్లీ వరకు వెళ్లిపోయిన బాబు వ్యవహారశైలిని గుర్తుచేస్తున్నారు నెజిజన్లు. ఓవైపు ఇలా కాలక్షేపం చేస్తూ, మరోవైపు ఈ నెలరోజులు రాష్ట్రం కోసం పనిచేస్తానని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం... బాబు ఇక ఈవీఎంల వ్యవహారాన్ని ఎంతమాత్రం పట్టించుకోరని, అందుకే పరోక్షంగా ఈ ట్వీట్ చేశారని చెప్పుకొచ్చారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటానని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని నెజిటన్లు ప్రస్తావించారు. సొంత రాజకీయాలతో బిజీగా ఉన్న బాబు, ఆఖరి నెలరోజులు కూడా ఇలా ప్రజల్ని మోసం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ ఐదేళ్లలో సాధించాల్సిన అభివృద్ధి ఒక్కనెలలో సాధించడం సాధ్యంకాదని లైట్ తీసుకోమని మరికొందరు సూచిస్తున్నారు.

తిత్లీ తుపాను బాధితులు, నిరుగ్యోగ భృతి అర్హులు, అన్నదాత సుఖీభవ చెక్కులు అందని వ్యక్తులు.. ఇలా చాలామంది ఈ ట్వీట్ పై స్పందించారు. కనీసం ఈ మిగిలిన నెల రోజుల్లోనైనా తమ సమస్యలు తీర్చాలని విజ్ఞప్తిచేశారు. బాబు మాత్రం ఇలా ట్వీట్ పెట్టి అలా మరో రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సిద్ధమౌతున్నట్టుంది.

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?

Show comments