చంద్రబాబు ఎక్కడో గట్టిగా దొరికిపోయాడా!

అసలేం జరుగోతోంది.. ఏం జరగబోతోంది? ఏపీలో మరిన్ని సంచలనాలు నమోదుకాబోతున్నాయా? ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరీ ఎందుకు అంత అదిరిపోతున్నాడు? ఎందుకు అంత ఆందోళన చెందుతున్నాడు? పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు?

ఆ నిర్ణయాలు తీసుకుంటే.. తను దొరికిపోయినట్టు అవుతుంది.. బూడిద గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా అవుతుందని తెలిసినా.. బాబు అలాంటి నిర్ణయాలే ఎందుకు తీసుకుంటున్నాడు? ఇంతకీ ఏపీలో ఏం జరగబోతోంది? చంద్రబాబు ఎక్కడో కేంద్రానికి బాగా దొరికిపోయాడా? లోపల ఏదో వ్యవహారం నడుస్తోందా? బుడగలా పుట్టిన అది త్వరలోనే బాంబై పేలబోతోందా?

సీబీఐ తన రాష్ట్రంలో విచారణ చేపట్టాలంటే తన ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ నిర్ణయంలో ప్రత్యర్థులకు ఆయుధాన్ని ఇచ్చాడు. ఈ విషయంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

జగన్ పై హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉందని బాబు భయపడ్డాడా? లేక తమ అవినీతి వ్యవహారాలపై విచారణ జరగబోతోందని ఉలిక్కిపడ్డాడో.. తెలియడం లేదు కానీ, సీబీఐ తన రాష్ట్రంలోకి అడుగుపెట్టకూడదని బాబు తీసుకున్న నిర్ణయం మాత్రం ఆయనలోని ఆందోళనకు అద్దం పడుతోంది.

ఒకవైపు బాబుకు అత్యంత సన్నిహితులు అయిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు గత కొన్నాళ్లుగా తెరపై కనిపించడం లేదు. వాళ్లు లోలోపల ఏవో సర్దుబాట్లు చేస్తున్నారని వినికిడి. అయినప్పటికీ ఏదో ముంచుకొస్తోందని బాబు భయపడుతున్నాడు.

ఈ విషయంలో తనకు ఢిల్లీ లెవల్లో కొన్ని పార్టీల అండ కావాలని.. వరసపెట్టి అందరినీ కలిసివచ్చాడు. అయితే వాళ్లెవ్వరూ బాబును రక్షించలేరు అనే సంగతి చిన్నపిల్లాడికీ అర్థం అయ్యే విషయమే. వాళ్లంతా ఇప్పుడు కోరల్లేని వారే. ఏ రకంగానూ బాబుకు ఉపయోగపడరు.

ఏదో జరగబోతోందని బాబులో భయాందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అందుకే సీబీఐ విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాడు. అది చెల్లదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి అసలు కథ ఏమిటో కానీ.. కుడితిలో పడ్డ ఎలుకలా బాబు గిజగిజలాడుతున్న వైనం మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది!

అసలు కథ ఏమిటో త్వరలోనే తెలిసే అవకాశాలున్నాయి. 

Show comments