ఈ మాత్రం దానికే.. వైసీపీ, జనసేనలపై ఫైరా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు ఎందుకు పోటీ చేయడంలేదు.. అని ప్రశ్నించేశాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అక్కడకేదో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాబుగారు పోటీచేసి, పొడిచేసి, చించేస్తున్నట్టుగా.. ఆ పార్టీలను ఎందుకు పోటీచేయడం లేదని ప్రశ్నించేశాడు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోందో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో తాము పోటీచేసిన సీట్ల కన్నా తక్కువ సీట్లకే చంద్రబాబు నాయుడు తన పార్టీని పోటీలో పెట్టాడు. అన్ని స్థానాలకూ పోటీ చేయాల్సింది పోయి.. కేవలం పదమూడు స్థానాలకు పరిమితం అయ్యాడు. అంటే తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదిశాతం సీట్లకు చంద్రబాబు తన పార్టీని పోటీలో పెట్టాడు.

ఈ మాత్రం పోటీకి కూడా తెలుగుదేశం పార్టీ ఆ జన్మ విరోధి కాంగ్రెస్ తో చేతులు కలిపింది. ఇది అత్యంత హేయమైన చర్య. ఈ విషయంలో విమర్శలు మామూలుగా లేవు. ఇంత చేసీ చంద్రబాబు నాయుడు ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల తరఫున అయినా ప్రచారం చేయబోతున్నాడా అంటే అదీ లేదు.

బాబు ప్రచారం చేయడానికి జంకుతూ ఉన్నాడు. తను ప్రచారానికి రానన్నట్టుగా తన పార్టీ వాళ్లకు స్వయంగా స్పష్టంచేశాడు. ఇదీ చంద్రబాబు ప్రతాపం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే పుట్టిందని చెబుతారు. తను తెలంగాణ బిడ్డనే అని చంద్రబాబు బిడ్డ లోకేష్ చెప్పుకుంటూ ఉంటాడు.

తన లేఖ వల్లేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైందని చంద్రబాబు ఒకటికి వందసార్లు చెప్పుకున్నాడు. ఇంతజేస్తే ఈయన పోటీ చేస్తున్నదే 13 సీట్లకు. ఈ ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడు తమకు తెలంగాణపై ఆశలు లేవనుకుని కామ్ అయిపోయిన వైసీపీని, మొదట్లో పోటీ చేస్తామని హడావుడి చేసి తర్వాత కామ్ అయిన జనసేనను ప్రశ్నించేయడం విడ్డూరమే!

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments