సుప్రీంకోర్టు చెప్పాకా.. చంద్రబాబు పంచాయితీ!

'ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంలు వాడటం లేదు, ఏపీలో పోలింగ్ రోజున ముప్పైశాతం ఈవీఎంలు పని చేయలేదు అని ప్రజలు చెప్పారు..' ఇవీ చంద్రబాబు నుంచి జాలువారిన ఆణిముత్యాలు. తాజాగా ఈ రోజున మరోసారి బాబు ఈ విషయాలను సెలవిచ్చారు.

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలు వాడటం లేదని.. మనమూ వెనక్కు వెళ్దామా? ప్రపంచంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని, ఇన్ని కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకునే దేశం ప్రపంచంలో మరోటిలేదని చంద్రబాబు నాయుడు తెలుసా తెలీదా? 

అయినా గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు మేధస్సుకు ఈ విషయం అందలేదా? ఈవీఎంల మీద జరిగిన ఎన్నికల్లోనే కదా బాబు గెలిచినది! అంటే..అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపర్ కావడంతోనే గెలిచారా? ఈ విషయాన్ని బాబు చెప్పకనే చెబుతున్నారా?

ఇక ముప్పైశాతం ఈవీఎంలు పని చేయలేదు... అనేది చంద్రబాబు నాయుడు పోలింగ్ రోజు తన వాళ్లకు ఇచ్చిన లీక్. అయితే ఇప్పుడు అది ప్రజలు చెప్పినమాట అని చంద్రబాబు నాయుడు అంటున్నారు! తను ఇచ్చిన స్టేట్ మెంట్ ను ప్రజలకు ఆపాదిస్తున్నారాయన!

ఇక వీవీ ప్యాట్ల లెక్కింపు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాకా కూడా చంద్రబాబు నాయుడు తన దుప్పటి పంచాయతీ పెడుతూ ఉండటం విశేషం! సుప్రీంకోర్టు ఆ అంశం గురించి విచారణ చేసి తీర్పును ఇచ్చింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ర్యాండమ్ గా ఎంపిక చేసి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించి, ఈవీఎం నంబర్లతో లెక్కచూడాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దానిపై బోలెడంత విచారణ జరిగాకా ఆ తీర్పు వచ్చింది.

అయితే చంద్రబాబు మాత్రం.. మళ్లీ యాభైశాతం వీవీ ప్యాట్లను లెక్కించాలనే అంటున్నారు. సుప్రీంకోర్టు చెప్పాకా కూడా.. బాబు పంచాయితీ ఏమిటో మరి! బాబు ఇలా మాట్లాడుతుండటాన్ని చూసి జనాలు ఏమనుకుంటున్నారో చెప్పనక్కర్లేదు.

ఎలాగూ ఓటమి తప్పదని బాబుకు అర్థం అయ్యింది, అందుకే ఆయన ఇప్పటి నుంచినే మొదలుపెట్టారు.. ఈవీఎంలను శంకించి, తన ఓటమికి అవే కారణమని తేల్చేయడానికే బాబు ఇలా మాట్లాడుతున్నారు.. అనేది సామాన్య ప్రజానీకం చెబుతున్న మాట! 

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను

Show comments