చంద్రబాబు ప్రయత్నం అంతా దానికోసమే!

'నవీన్ పట్నాయక్ హెలీకాప్టర్ ను తనిఖీ చేస్తున్నారు. కుమారస్వామి హెలికాప్టర్ ను తనిఖీ చేస్తున్నారు.. ఏం జరుగుతోంది అసలు.. మీరు మోడీ హెలీకాప్టర్ ను ఎందుకు తనిఖీ చేయడంలేదు?' అంటూ మండిపడ్డారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఏ విషయాన్నీ వదిలేది లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడి రన్నింగ్ కామెంట్రీ  కొనసాగుతూ ఉంది.

హెలీకాప్టర్లను తనిఖీ చేయడం తప్పేమీకాదు. దానికి చంద్రబాబు నాయుడు మరీ అంతలా ఫీల్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు హెలీకాప్టర్లను ఎవరూ తనిఖీ చేయలేదు. కుమారస్వామి, పట్నాయక్ లు ప్రయాణించిన వాటిని తనిఖీలు చేశారు. అయినా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.

అయితే ఎన్నికల అధికారులు తనిఖీ చేసింది కేవలం వారిద్దరి హెలీకాప్టర్లనే కాదు. కర్ణాటకలో అయితే యడ్యూరప్ప ప్రయాణించిన హెలీకాప్టర్ ను పలుసార్లు తనిఖీ చేశారు. బహుశా మోడీ హెలీకాప్టర్ ను తనిఖీ చేసి ఉండకపోవచ్చు. అలా అంటే చంద్రబాబు హెలీకాప్టర్ ను కూడా తనిఖీ చేయలేదు. మిగతా వాళ్లను అయితే పార్టీలకు అతీతంగా అందరి విషయంలోనూ తనిఖీలు జరిగాయి.
 
ఈమాత్రం దానికి పట్టుకుని చంద్రబాబు నాయుడు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఏ ఒక్క అవకాశాన్నీ వదిలేది లేదన్నట్టుగా ఎన్నికల అధికారులను విమర్శించడానికి చంద్రబాబు నాయుడు చాలా శ్రమపడుతూ ఉన్నారు. బాబు ప్రయత్నం అంతా ఎంతసేపూ ఎన్నికలు ప్రక్రియను తక్కువచేసి చూపడం మీదే ఉందని మాత్రం క్లారిటీ వస్తోంది.

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?