బాబు బయోపిక్.. ఒరియా సినిమాలా!

అసలుకు పార్టీ పవర్‌లో ఉంది.. ఇలాంటి సమయంలో చంద్రబాబు బయోపిక్ అంటే.. అదెలా ఉండాల్సింది? నిత్యం గడ్డంతో కనిపించే ఎవరైనా స్టార్ హీరోని పెట్టి సినిమా తీసుకోవాల్సింది. అలా కాదంటే.. ఈ లొల్లి ఎందుకని ఈ బయోపిక్‌ను ఆపించాల్సింది. విచిత్రంగా ఇలా పెట్టుడుగడ్డం హీరోతో బాబు బయోపిక్ తీయడమే ఆశ్చర్యకరంగా ఉంది. ఆ గడ్డమే ఈ సినిమా నాణ్యతకు దర్పణంగా మారింది.

ఈ సినిమాకు పేరునైతే బాగానే సెలెక్ట్ చేసుకున్నారు కానీ... హీరోనే మరీ పేరడీలా ఉన్నాడు. అవతల చాలామంది రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ తీస్తున్నారు. వాటిల్లో స్టార్లు నటిస్తున్నారు. అయితే చంద్రబాబు బయోపిక్ మాత్రం మరీ నాసిరకంగా కనిపిస్తోంది. ఆ పెట్టుడు గడ్డం, ఆ నటుడి హావభావాలు.. మరీ ఒరియా సినిమాలా కనిపిస్తున్నాయి ఈ స్టిల్స్.

చంద్రబాబు అధికారంలో లేని కాలంలో ఇలా పరిమిత బడ్జెట్లో ఏదో చిన్న సినిమాను తీశారంటే అదో లెక్క. భోజ్ పురి సినిమాను ఒరియా హీరోను పెట్టి తీస్తే ఎలా ఉంటుందో.. అలా ఉంది ఈ చంద్రోదయం లుక్. అవతల ఎన్టీఆర్ బయోపిక్ లో బాబు పాత్రను దగ్గుబాటి రాణాతో చేయిస్తున్నారు. మరి బాబు బయోపిక్ విషయంలో కూడా బామ్మర్ధి బాలయ్య సలహాలు, సూచనలు తీసుకుని ఉంటే సరిపోయేదేమో!

Show comments