లగడపాటి సర్వే నమ్మితే సర్వనాశనం

ఓవైపు సంస్థలన్నీ వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాడు. లగడపాటి మాత్రం అంతా ఊహించినట్టుగానే తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటపెట్టారు. ఈ ఒక్క సర్వేను సాకుగా చూపి టీడీపీ నేతలంతా చంకలు గుద్దుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత మాత్రం రివర్స్ అయ్యారు. ఆయన మరెవరో కాదు, టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్నపాత్రుడు.

లగడపాటికి సర్వే చేయడం రాదన్నారు అయ్యన్నపాత్రుడు. తన 37 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి చెత్త సర్వే చూడలేదన్నారు. లగడపాటి ఎగ్జిట్ పోల్స్ నమ్మి తెలంగాణ ఎన్నికల్లో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ల ఉన్నారని అన్నారు.

"మొన్న తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆ బెజవాడోడు లగడపాటి ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నమ్మి కోట్ల రూపాయలు పందాలు కాశారు. దాదాపు 600 కోట్ల రూపాయల వరకు తగలేసుకున్నారు. ఓసారి హైదరాబాద్ పెళ్లికి వెళ్లాను. అక్కక కొందరు బాధితులు నాతో చెప్పారు. వాడి (లగడపాటి) మాట నమ్మి సర్వనాశనం అయిపోయామని బాధపడ్డారు. ఎందుకలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలి."

ప్రజల నాడి ఏంటో తెలియని ప్రతి ఒక్కడు సర్వేలు చేస్తున్నారని పరోక్షంగా లగడపాటిపై విరుచుకుపడ్డారు అయ్యన్నపాత్రుడు. ఇది చాలా ప్రమాదమని అన్నారాయన.  

"ప్రజల నాడి తెలిసిన వాడే ఎగ్జిట్ పోల్ చేయాలి. ప్రజా నాడి తెలియని పనికిమాలిన వాళ్లంతా ఎగ్జిట్ పోల్స్ చేస్తే ఇలానే ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. అసలు ప్రజల నాడి నీకేం తెలుసు లగడపాటి."

ఓవైపు ఈ ఒక్క సర్వేతో టీడీపీ నేతలు పండగ చేసుకుంటుంటే.. వాళ్లకు ఆ మాత్రం ఆనందం కూడా లేకుండా చేశారు అయ్యన్నపాత్రుడు. టీడీపీలోనే ఉంటూ, ఆ పార్టీకి అనుకూలంగా వచ్చిన సర్వేపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎన్నికల తరహాలో కోట్లాది రూపాయలు బెట్టింగ్ కాసిన వ్యక్తుల జీవితాలతో లగడపాటి ఆడుకుంటున్నారని విమర్శించారు.

ప్రజల్లో మేరానామ్ జోకర్?!

ఎమ్బీయస్‌: బెదురు బాబు

Show comments