ఆగస్ట్ 2న శర్వా 'రణరంగం'

సుధీర్ వర్మ-శర్వానంద్ కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా రణరంగం. ఈ సినిమాకు ఆది నుంచి సరైన టైటిల్ కోసం వెదుకుతూ వచ్చారు. దళపతి అన్న టైటిల్ కోసం చివరి వరకు ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో, సెకండ్ ఆప్షన్ అయిన రణరంగం అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. వింటేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయిన రణరంగంలో శర్వా రెండు గెటప్ ల్లో కనిపిస్తాడు. 

యంగ్ గా, ఓల్డ్ ఏజ్డ్ మాఫియా డాన్ గా శర్వా కనిపించే ఈ సినిమాను ఆగస్టు 2న విడుదల చేస్తారు. ఈ మేరకు విడుదల డేట్ ను ఫిక్స్ చేసారు. వాస్తవానికి జూలై రెండోవారంలో విడుదల చేయాలనుకున్నా, రామ్-పూరిల ఇస్మార్ట్ శంకర్ విడుదల ప్లాన్ చేసుకున్నారు. రామ్ తో వున్న స్నేహ సంబంధాల కారణంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ తన సినిమా డేట్ ను వెనక్కు జరుపుకుంది. 

ఈ మేరకు రణరంగం ఫస్ట్ లుక్ ను, విడుదల డేట్ ను ఈరోజు ప్రకటించారు. ఇంటెన్సివ్ విడియో బైట్ ను కట్ చేసి, ఫస్ట్ లుక్ గా వదిలారు. అలాగే శర్వా ఓల్డ్ మాఫియా డాన్ లుక్ ను కూడా రివీల్ చేసారు. ఈ రెండూ కచ్చితంగా సినిమా మీద ఆసక్తి పెంచేలా వున్నాయి.