అవినీతి తలెత్తితే పేషీ ఖాళీ

జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు దగ్గరవుతోంది. మరి మంత్రులు ఎవరు అన్నదానిపై చాలా ఊహాగానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. సీనియర్లు చాలామంది, పార్టీని చిరకాలంగా నమ్ముకున్నవారు, పార్టీ కోసం బాగా ఖర్చుచేసిన వారు ఇలా చాలామంది వున్నారు. అయితే వీరందరిలో ఎంతమందికి చాన్స్ వస్తుంది అన్నది ప్రశ్న.

సామాజిక సమతూకాలు తప్పవు. రెడ్లు అధికంగా వున్నారు. అందువల్ల ఆరు నుంచి ఎనిమిది మంది రెడ్లు మంత్రులుగా వుంటారు. ఆ తరువాత కాపులు, బిసిలకు సమస్థానం ఇవ్వాలి. చెరో నలుగురు వుండే అవకాశం వుంది. క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య ల్లాంటి నాన్ రిజర్వ్ డ్ వర్గాలకు, దళితులకు కలిసి కనీసం ఆరు మంత్రి పదవులు వెళ్తాయని తెలుస్తోంది.

ఇదిలావుంటే మంత్రివర్గంలో సీనియర్లు ఏ మేరకు వుంటాయరన్నది పెద్ద ప్రశ్నగా వుంది. సీనియర్లు అందరికీ అవకాశం వుంటుందా? వుండదా? జగన్ మనసులో ఏమంది అన్నదానిపై అస్సలు ఉప్పు అందడం లేదు జనాలకు. జగన్ నిన్నటికి నిన్న ఒక విషయం మాత్రం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏ మంత్రిశాఖలో అయినా అవినీతి అన్నమాట వినిపించితే, ఆ మర్నాడే పేషీ ఖాళీ అవుతుందని జగన్ నిర్మొహమాటంగా చెప్పేసినట్లు తెలుస్తోంది. తాను పాతికేళ్లపాటు రాజకీయం చేయడానికి వచ్చా అని, అందుకు అనుగుణంగా వుండాలనుకునేవారే తనతో వుండవచ్చని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

సీనియర్లను సన్నిహితులు ఎవరైనా, ఏ శాఖ వస్తుందనుకుంటున్నారు అని అడిగితే, అసలు మంత్రి అవుతానో లేదో తెలియదు, శాఖ సంగతి ఏమిటి చెప్పాలి అని బదులు ఇస్తున్నారట. ఎందుకుంటే జగన్ చాలా స్పెషల్ గా తన టీమ్ ను ఎన్నుకునే అవకాశం వుందని తెలుస్తోంది.

ప్రజలు చాలా గట్టి మాండేటరీ ఇచ్చినపుడే తను నిర్ణయాలు గట్టిగా తీసుకోగలనని, జగన్ భావిస్తున్నట్లు బోగట్టా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు

Show comments