మరో సౌత్ దర్శకుడికి బాలీవుడ్ ఛాన్స్!

బాలీవుడ్ ఇప్పుడు దక్షిణాది వైపు చూస్తూ ఉంది. భారీ సినిమాల కోసం అయినా, మంచి కథల కోసం అయినా బాలీవుడ్ బడా వాలాలు సౌత్ వైపు చూస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో మరో సౌత్ ఇండియన్ దర్శకుడికి బాలీవుడ్ లో బిగ్ ఆఫర్ దక్కడం దాదాపు ఖరారే అని తెలుస్తోంది.

ఇటీవలే 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో బిగ్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలో మరో సౌత్ ఇండియన్ దర్శకుడు బాలీవుడ్ లో సినిమాను రూపొందించబోతున్నాడట. అతడే అట్లీ. ఇదివరకూ 'రాజా రాణి'తో సహా విజయ్ తో సినిమాలు చేసిన దర్శకుడే ఈ అట్లీ. ఇప్పుడు కూడా విజయ్ తో ఒక సినిమాను రెడీ చేశాడు. 'బిజిల్' పేరుతో ఆ సినిమా దీపావళికి విడుదల కాబోతోంది.

ఇటీవలి సమ్మర్ లో ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై వచ్చినప్పుడు కేకేఆర్ ఓనర్ కూడా అయిన షారూక్ ఖాన్ అట్లీని కలిశాడట. అట్లీ ఆఫీస్ కు కూడా వెళ్లి స్టోరీ డిస్కస్ చేశారట. దాదాపుగా ప్రాజెక్ట్ ఖరారు అయినట్టుగా సమాచారం. అసలే షారూక్ వరస ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాతో హిట్ కొడితే తప్ప స్టార్ డమ్ కొనసాగడం కష్టం అవుతోంది.

షారూక్, అట్లీ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా రెడీ అయినట్టుగా సమాచారం. బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ ఆ సినిమాను రూపొందించనున్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది.

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!