ఆసియన్ సునీల్-శేఖర్ కమ్ముల

నిర్మాణ రంగంలోకి రావాలని నైజాం ఆసియన్ సునీల్ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామందికి అడ్వాన్స్ లు ఇచ్చారు. నిఖిల్, చందు మొండేటి తదితరులు ఎప్పటి నుంచో ప్లానింగ్ లో వున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్-సందీప్ వంగా సినిమా ఫైనల్ అయింది. 

ఇప్పుడు మరో సినిమా ఫైనల్ చేసేసారు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల చేయబోయే సినిమాను ఆసియన్ సునీల్ నిర్మించేందుకు డెసిషన్ ఫైనల్ అయింది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల కథ, మాటలు, స్క్రిన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారు.

సినిమా స్క్రిప్ట్ మొత్తం రెడీ అయింది. అంతా ఓకె. కానీ స్టార్ట్ కాస్ట్ మాత్రం ఇంకా డిస్కషన్ లోనే వుంది. ఈలోగా లాంఛనంగా ఓ ప్రకటన విడుదల చేయాలని ఆసియన్ సునీల్ నిర్ణయించుకున్నారు. ఇవ్వాళో, రేపో ఆ ప్రకటన వస్తుంది.

మరి ఇంతకీ శేఖర్ కమ్ముల ఏ హీరోతో చేయాలనుకుంటున్నారో? కచ్చితంగా యూత్ హీరోనే అన్నది పక్కా. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమాలు అన్నీ యూత్ లవ్ స్టోరీలే కదా?

Show comments