సీఎం అభ్యర్థులిద్దరూ పోటీలో..రచ్చరచ్చే!

ప్రస్తుతం జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బాగా అవకాశాలుండేది రాజస్తాన్ లో అని మీడియా ఘంటాపథంగా చెబుతోంది. ప్రతి ఐదేళ్లకూ ఒక ప్రభుత్వాన్ని మార్చేసే తత్వం ఉంది రాజస్తాన్ ప్రజలకు. ఒక ఛాన్స్ బీజేపీకి మరో ఛాన్స్ కాంగ్రెస్ కు. ఎవరిని కొట్టినా చితక్కొడటం ఎడారి రాష్ట్రం ప్రత్యేకత. గత పర్యాయం కాంగ్రెస్ ను దేనికీ పనికి రానంత స్థాయిలో కొట్టారు రాజస్థానీయులు.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను అలాగే కొట్టారు అక్కడి జనాలు. ఈసారి బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ మరీ కాంగ్రెస్ లా చిత్తు అయిపోకపోవచ్చు కానీ.. పైచేయి మాత్రం కాంగ్రెస్ దే అని మీడియా వర్గాలు, సర్వేలు చెబుతున్నాయి.

మరి కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠం ఎవరికి అనేది మరో చర్చ. ఈ సీటు విషయంలో ప్రధానంగా ఇద్దరు పోటీదారులు. ఒకరు మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, మరొకరు సచిన్ పైలట్. వీరిద్దరి పోటీకీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియోజకవర్గాలు కూడా ఖరారు అయ్యాయి.

సర్దార్ పురా నుంచి గెహ్లాట్, టోంక్ నుంచి పైలట్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే సీఎం పీఠం రేసులో వీళ్లిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పార్టీ గెలిస్తే తామే సీఎం అని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు కూడా. ఇలాంటి నేఫథ్యంలో రాహుల్ గాంధీ ఏం డిసైడ్ చేస్తాడో!

గెహ్లాట్ ను తప్పిస్తారని.. జాతీయ రాజకీయాలు అంటారని.. ఎంపీగా బరిలోకి దించుతారని.. ప్రస్తుతానికి సర్ధి చెబుతారని ప్రచారాలు జరిగాయి కానీ, చివరకు మాత్రం ఆయన పోటీకి అధిష్టానం నో చెప్పలేకపోయింది.

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments